ప్రయాణికులను త్వరగా గమ్య స్థానాలకు చేర్చేందుకు, హైదరాబాద్(Hyderabad) నగరంలోని ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటైన మెట్రో రైళ్లలో సాంకేతిక సమస్యలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ముసారాంబాగ్ మెట్రో స్టేషన్ లో రైలు ఆగిపోయిన ఘటనను మరవకముందే మరోసారి హైదరాబాద్ మెట్రో సేవల్లో(Metro Services) అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య తలెత్తి నాంపల్లి మెట్రో స్టేషన్‌లో(Nampalli Metro Station) ట్రాక్‌పై మెట్రో రైలు నిలిచిపోయింది. దీంతో మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ కారిడార్‌లో రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మిగతా కారిడార్లలోనూ మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడం, మెట్రో స్టేషన్లలో భారీగా ప్రయాణికులు చేరడంతో ఆయా స్టేషన్లు రద్దీగా మారాయి. గతేడాది కూడా మెట్రో రైళ్లలో పలుసారు సాంకేతిక సమస్యలు వచ్చాయి. రైళ్లులో సాంకేతిక సమస్యలు రావడంత ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సాంకేతిక సమస్యలు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ పెరిగి వాతావరణంలో దుమ్ము, దూళి కాలుష్యం పెరగడంతో ఒక్కసారిగా మెట్రో రైళ్లు అకస్మాత్తుగా నిలిచిపోతున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు. అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో మెట్రో రైళ్లు నిలిచిపోతున్నప్పటికీ రద్దీ సందర్భాల్లో మెట్రో సేవలు నగరవాసులకు ఎంతగానో ఉపయోపగడుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ప్రయాణం చేయగల్గుతున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి