Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..

పరిచయం కాస్తా స్నేహంగా మారింది.. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన వచ్చింది. నిన్నే పెళ్లి చేసుకుంటా.. నీ ఇద్దరు పిల్లలను కూడా చూసుకుంటా’ అంటూ అతడు చెప్పిన మాటలను ఆమె నమ్మింది. అతనితో పలు మార్లు హోటల్‌కు సైతం వెళ్లింది. కట్‌చేస్తే.. కొన్నాళ్లకే అసలు విషయం వెలుగు చూసింది. సదరు వ్యక్తి తనను మోసం చేశాడని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఇంతతకూ అతను చేసిన మోసమేంటి?.. ఆమెకు తెలిసిన నిజమేంటో తెలసుకోవాలి అంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
Marriage Fraud In Hyderabad

Edited By:

Updated on: Aug 09, 2026 | 8:23 AM

పెళ్లి పేరుతో ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలు ఉన్న 35 ఏళ్ల మహిళను మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. వివారల్లోకి వెళ్తే.. బాధిత మహిళ సినిమా పరిశ్రమలో షూటింగ్ ఈవెంట్స్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు మహమ్మద్ మతీన్, మహమ్మద్ ఆమిర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో 2013లో మతీన్‌ను ఆమె వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే దాంపత్య జీవితంలో విభేదాలు కారణంగా 2023 డిసెంబర్‌లో ఖులా ద్వారా మతీన్‌తో ఆమె విడిపోయింది.

ఈ విడాకుల తర్వాతే ఆమె జీవితం మరో మలుపు తిరిగిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తన వైవాహిక జీవితం గురించి మొదటి నుంచే తెలిసిన ఆమిర్ తనకు దగ్గరయ్యాడని.. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పాటు తన ఇద్దరు పిల్లల బాధ్యత కూడా తీసుకుంటానని నమ్మించాడని తెలిపింది. అది నిజమేనని నమ్మిన ఆ ఆమె 2024 నుంచి 2026 మధ్య సుమారు ఏడుసార్లు అతనితో హోటల్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకుంటానని పదేపదే చెప్పడంతో అతడిని నమ్మి శారీరక సంబంధానికి అంగీకరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

అసలు ట్విస్ట్ అక్కడే..

అంతా పెళ్లి వైపే వెళ్తోందని ఆమె భావిస్తున్న సమయంలో ఊహించని విషయం తెలిసింది. సుమారు నెల రోజుల క్రితం ఆమిర్ అప్పటికే మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలిసిందని ఆమె ఫిర్యాదులు వివరిస్తూ కంటితడ పెట్టుకుంది. విషయం తెలిసిన వెంటనే కంగుతున్ని మహిళ.. తనను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకుండానే పెళ్లి హామీ ఇచ్చి శారీరక సంబంధానికి ఒప్పించాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. అతడి మాటలను నమ్మడం వల్ల తాను తీవ్ర మానసిక వేదన, అవమానానికి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.

చివరకు పోలీస్ స్టేషన్‌కు ‘పెళ్లి పంచాయితీ’

ఆగస్టు 5న మహిళ ఫిర్యాదును స్వీకరించిన మాసబ్‌ట్యాంక్ పోలీసులు క్రైమ్ నంబర్ 165/2026 నమోదు చేశారు. BNS సెక్షన్లు 69, 318(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పెళ్లి చేస్తానన్న మాట నిజమైన హామీనా..? లేక మొదటి నుంచే మోసం చేయాలనే ఉద్దేశంతో చెప్పాడా..? అనే అంశాలతో పాటు మహిళ చేసిన ఆరోపణల నిజానిజాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us