Hyderabad: పాపం ఎవరో.. ఏంటో.. మలక్‌పేట రైల్వే స్టేషన్‌కు ఎందుకొచ్చాడో..! అసలేం జరిగిందంటే..

|

Jan 11, 2024 | 6:03 PM

జల్సాలకు అలవాటుపడ్డాడు.. డబ్బులకోసం దొంగతనాలు మొదలుపెట్టాడు.. ఈ తరుణంలోనే.. సెల్‌ఫోన్‌ కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ పరిధిలోని మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో (జనవరి 6న) శనివారం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును హైదరాబాద్‌ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) గురువారం ఛేదించారు.

Hyderabad: పాపం ఎవరో.. ఏంటో.. మలక్‌పేట రైల్వే స్టేషన్‌కు ఎందుకొచ్చాడో..! అసలేం జరిగిందంటే..
Mobile
Follow us on

జల్సాలకు అలవాటుపడ్డాడు.. డబ్బులకోసం దొంగతనాలు మొదలుపెట్టాడు.. ఈ తరుణంలోనే.. సెల్‌ఫోన్‌ కోసం ఓ వ్యక్తిని దారుణంగా చంపాడు.. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌ పరిధిలోని మలక్‌పేట రైల్వే స్టేషన్‌లో (జనవరి 6న) శనివారం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును హైదరాబాద్‌ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) గురువారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. నిందితుడు మొబైల్‌ ఫోన్‌ కోసం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తిని చాదర్‌ఘాట్‌కు చెందిన దినసరి కూలీ మహ్మద్ సోహైల్ (24)గా గుర్తించారు. అతను 40 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపినట్లు అంగీకరించాడని పేర్కొన్నారు. నిందితుడిపై హైదరాబాద్ సిటీ పోలీసుల వద్ద హిస్టరీ షీట్ ఉందని రైల్వే, రోడ్డు భద్రత ఏడీజీ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితుడు ఆ ఫోన్‌ను MGBSలో తెలియని వ్యక్తికి రూ.1, 700కి విక్రయించాడని.. డబ్బును అతని వ్యక్తిగత ఖర్చుల కోసం ఖర్చు చేసినట్లు తెలిపారు. గతంలో హైదరాబాద్‌లోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో అతనిపై కేసులు నమోదై ఉన్నాయని.. తెలిపారు.

జనవరి 6న మలక్‌పేట రైల్వే స్టేషన్‌లోని రెండవ నంబర్ ప్లాట్‌ఫారమ్‌పై కత్తిపోట్లతో చనిపోయిన వ్యక్తి మృతదేహం స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతి కేసును నమోదు చేశారు. అనంతరం శవపరీక్ష నివేదిక ఆధారంగా; కేసును హత్యగా మార్చారు. నిఘా కెమెరాల ఫుటేజీ సహాయంతో, అనుమానితుడిని గుర్తించి, యాకుత్‌పురా రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు.

అయితే, చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఫోటోలు చూసి వారి కుటుంబసభ్యులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. సుమారు 40 ఏళ్ల వయస్సు ఉంటుందని.. కుడి చేతిపై తెలుగులో ‘అమ్మా’ అని పచ్చబొట్టు ఉందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..