CM Revanth Reddy: పాక్‌ను విభజించండి.. POKను కాశ్మీర్‌లో కలపండి.. ఉగ్రదాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి!!

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయలకుల నివాళులర్పించారు.

CM Revanth Reddy: పాక్‌ను విభజించండి.. POKను కాశ్మీర్‌లో కలపండి.. ఉగ్రదాడిని ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి!!
Cm Revanth Reddy

Updated on: Apr 26, 2025 | 8:46 AM

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాద్‌లో క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ శాంతి ప్రదర్శన పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమై ట్యాంక్‌బండ్‌పై ఉన్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులతో పాటు మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద చర్యలను వారు ఖండించారు.

జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయలకుల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పహల్గామ్‌లో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను ఖండిస్తున్నాం అన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతగానో ఉందని సీఎం రేవంత్ అన్నారు. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతీ చర్యకు మద్దతు పలికేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం అని సీఎం రేవంత్ అన్నారు.

1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినపుడు ఉగ్రవాదులకు ఇందిరాగాంధీ గట్టి జవాబు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అప్పటి ప్రభుత్వం దెబ్బతో పాకిస్తాన్ రెండు ముక్కలు అయిందన్నారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్ పేయ్ దుర్గామాతతో పోల్చారని గుర్తుచేశారు. దుర్గామాత భక్తులైన ప్రధాని మోదీ ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని కోరారు. కోట్లాది భారతీయులంతా మీకు మద్దతుగా ఉన్నారని.. ఒక్క దెబ్బతో పాకిస్థాన్ ను రెండు ముక్కలు చేయాలని ఆయన..పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు.

పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంఘీభావం తెలపడంతో పాటు ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలనే కాంగ్రెస్ అధిష్ఠాన పిలుపులో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…