HYDRA: కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన.. వారికి భారీ ఊరట

|

Oct 21, 2024 | 8:31 AM

హైడ్రా నుంచి కీలక ప్రకటన వచ్చింది. రియల్‌ ఎస్టేట్‌కు టెన్షన్‌ తగ్గిస్తూ... బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చింది. రూల్స్ ప్రకారం పర్మీషన్‌ ఉంటే.. బుల్డోజర్‌కు భయపడాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు రియల్‌ ఎస్టేట్‌కు హైడ్రా ఇచ్చిన భరోసా ఏంటి ఏంటి..?

HYDRA: కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన.. వారికి భారీ ఊరట
HYDRA Commissioner Ranganath
Follow us on
హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు భరోసా కల్పించేలా ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. హైదరాబాద్‌లో కూల్చివేతలపై కీలక ప్రకటన చేశారు. చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని రంగనాథ్ వెల్లడించారు. చెరువుల వద్ద అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని… ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న నిర్మాణాలు కూల్చివేయబోమన్నారు. చెల్లుబాటు అయ్యే అనుమతులున్న ఏ నిర్మాణాలను కూల్చొద్దన్న… సీఎం ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఇక ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిని నిర్ధారించిన తర్వాత కూల్చివేతలు చేపట్టనున్నారు. అయితే హైదరాబాద్‌లోని బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పరిధిలో ఆక్రమణలకు గురైన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఈ కూల్చివేతపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో హైడ్రా వివరణ ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..