ఎవరైనా ముందుకు స్కేటింగ్ చేయడం సర్వ సాధారణం..కానీ ఈ చిన్నారులు బ్యాక్ స్కేటింగ్ చేస్తూ అబ్బుర పరిస్తున్నారు. తెలంగాణలో ప్రపంచ రికార్డు కోసం తెలంగాణ చిన్నారులు ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ జిల్లాకి చెందిన కలకోట నవీన్ కుమార్, అశ్వనీ దంపతుల కుమారులు రాజేష్ కుమార్(13) ఉమేష్ కుమార్(12) ఈ చిన్నారులు స్కేటింగ్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్యాక్వర్డ్ స్కేటింగ్ 300 కిలోమీటర్స్ నాన్ స్టాప్ మల్టీ టాస్కింగ్లో ఈ ఘనత చేయబోతున్నారు. బ్యాక్ స్కేటింగ్ చేస్తూనే ప్రజల్లో సామాజిక స్పృహను నెలకొల్పేందుకు సేవ్ గర్ల్స్..డోంట్ డ్రంక్ అండ్ డ్రగ్స్ అనే నినాదాలు ప్రదర్శిస్తున్నారు.
వీళ్ళ స్కేటింగ్ ఉదయం 06:00 గంటలకి తెలంగాణలో రామోజిఫిల్మ్ సిటీ నుండి బయలు దేరి భద్రాచలం వరకు కొనసాగుతుంది. రికార్డ్ నిర్వహణకు వరల్డ్ రికార్డ్ అధికారులతో పాటు మొత్తం ఆరు రికార్డుల అధికారులు హాజరవుతున్నారు. గురువారం ఖమ్మం జిల్లా సరిహద్దు కూసుమంచి మండలం నాయకన్ గూడెం వద్దకు చేరుకున్నారు. వీరికి స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు స్వాగతం పలికారు. వీరు పలువురు ప్రశంసలు అందుకున్నారు.