President Droupadi Murmu: హైదరాబాద్‌‌‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..

రాష్ట్రపతి ముర్ము ఉదయం 10 గంటలకు స్పెషల్ విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు.

President Droupadi Murmu: హైదరాబాద్‌‌‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
President Droupadi Murmu

Updated on: Jul 04, 2023 | 7:57 AM

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇవాళ తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్‌‌‌లో నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతి ముర్ము ఉదయం 10 గంటలకు స్పెషల్ విమానంలో ఢిల్లీ నుంచి హకీంపేట వైమానిక శిక్షణ కేంద్రానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి నిలయంకు పర్యాటకుల సందర్శన తీరును రాష్ట్రపతి ముర్ము సమీక్షించనున్నారు. నగర ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించొద్దన్న ఉద్దేశ్యంతో సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్‌లో గచ్చిబౌలి స్టేడియానికి చేరుకుంటారు. ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (జులై 4) హైదరాబాద్‌లో పర్యటించనున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా వాహనాల రాకపోకలను మళ్లించారు. భారత రాష్ట్రపతి హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. ట్రాఫిక్ కొద్దిసేపు నిలిపివేయబడుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

ఈ ప్రదేశాలలో/రూట్లలో ప్రయాణించేవారు చూసుకుని బయలుదేరాలి.

  • హనుమాన్ ఆలయం, హకీంపేట్ Y జంక్షన్ సమీపంలో..
  • బొల్లారం చెక్ పోస్ట్
  • నేవీ జంక్షన్
  • యాప్రాల్ రోడ్
  • హెలిప్యాడ్ వై జంక్షన్
  • బైసన్ గేట్
  • లోతుకుంట

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 06 గంటల మధ్య విఐపిల సంచారం కారణంగా, ట్రాఫిక్ కొద్దిసేపు నిలిపివేయబడుతుంది.

ఈ క్రింది ప్రదేశాలు/మార్గాలు ఇవే..

  • బొల్లారం
  • అల్వాల్
  • లోత్కుంట
  • త్రిముల్‌గేరి
  • కార్ఖానా
  • జేబీఎస్
  • ప్లాజా జంక్షన్
  • పీఎన్‌టీ ఫ్లైఓవర్
  • హెచ్‌పీఎస్ అవుట్ గేట్
  • బేగంపేట్ ఫ్లైఓవర్
  • గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్
  • మోనప్ప జంక్షన్పం
  • పంజాగుట్ట
  • NFCL
  • ఎన్టీఆర్ భవన్
  • జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్
  • రోడ్ నెం. 45 జంక్షన్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం