Hyderabad: ఓర్నీ.. ఇది యాడ్నుంచి వచ్చింది.. మియాపూర్ మెట్రో వద్ద చిరుత

|

Oct 18, 2024 | 9:34 PM

మియాపూర్‌లో చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి చిరుత సంచరించినట్టు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వీడియో ట్రెండ్ అయింది. సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆవవాళ్లు గుర్తించేందుకు ట్రై చేస్తున్నారు.

ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో.. హైదరాబాద్ సిటీలో తిరుగుతుంది చిరుత. అది కూడా మెట్రోస్టేషన్‌ దగ్గరే చక్కర్లు కొడుతోంది. స్థానికులతో పాటు మెట్రో ప్రయాణికులను టెన్షన్ పెడుతోంది.

హైదరాబాద్‌ నగరంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టించింది. మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర చిరుత తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వాళ్లు ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆవవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో స్థానికులు అలెర్ట్‌గా ఉండాలని సూచించారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..