
బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ స్తంభం విరిగి పడి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లోని నాచారం పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. స్థానికు సమచారంతలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళవారం తెల్లవారుజామున నాచారం పీఎస్ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న సాత్విక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఉదయం బైక్‌పై వెళ్తున్న క్రమంలో డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ పోల్ విరిగి ఒక్కసారిగా సాత్విక్ బైక్‌పై పడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన సాత్విక్ అక్కడికక్కడే మరణించాడు.
ప్రమాదాన్ని గమనించిన ఇతర వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.\
వీడియో చూడండి..
lమరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి