Hyderabad: లైంగిక వేధింపుల కేసులో సైకాలజిస్ట్ నగేష్ అరెస్ట్.. పక్కా ఆధారాలతో పోలీసుల చర్యలు..

అతనో సైకాలజిస్ట్‌, పైగా మోటివేషనల్‌ స్పీకర్‌, అతను చెప్పే మాటలు వింటే అబ్బో ఎంత మంచోడో అనుకుంటాం. కానీ, వాడి అసలు రంగు బయటపెట్టింది ఓ బాలిక.

Hyderabad: లైంగిక వేధింపుల కేసులో సైకాలజిస్ట్ నగేష్ అరెస్ట్.. పక్కా ఆధారాలతో పోలీసుల చర్యలు..
Arrest

Updated on: Sep 04, 2022 | 7:21 AM

Psychologist Nagesh Arrest: మైక్‌ అందుకున్నాడంటే లెక్చర్లు దంచికొడతాడు. సూక్తులకు లెక్కే ఉండదు. మంచి మాటలెన్నో చెబుతాడు. అతని మాటలు వింటే, ఈయన ఎంత మంచోడో అనుకుంటారు. ఇక్కడే అందర్నీ బోల్తా కొట్టిస్తాడు. సందేహాలుంటే ఫోన్‌ చేయండంటూ నెంబర్‌ ఇస్తాడు, ఆ తర్వాతే తన అసలు రూపాన్ని బయటపెడ్తాడు. అలా, అతని అసలు రంగును బయటపెట్టింది ఓ బాలిక. సైకాలజిస్ట్‌, మోటివేషనల్‌ స్పీకర్‌ మాటున బీపీ నగేష్‌ చేస్తోన్న రోత పనులపై పోలీసులకు కంప్లైంట్‌ చేసింది ఓ బాధితురాలు. కౌన్సెలింగ్‌ క్లాసుల పేరుతో తనతో అసభ్యంగా మాట్లాడాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. బాలిక కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన షీ టీమ్ పోలీసులు, పక్కా ఆధారాలతో బీపీ నగేష్‌ను అరెస్ట్‌ చేశారు. నాంపల్లి కోర్టు రిమాండ్‌ విధించడంతో ఇప్పుడు చంచల్‌గూడ జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు సైకాలజిస్ట్‌ నగేష్‌. హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో మోటివేషనల్‌ స్పీచ్‌లు, కౌన్సెలింగ్‌ క్లాసులు ఇచ్చిన నగేష్‌, చాలా మంది యువతులను, మహిళలను వేధించినట్లు గుర్తించారు.

ఆంధ్రప్రదేశ్‌, గుంటూరు జిల్లా ఈపూరు గ్రామస్తుడైన నగేష్‌, మాదాపూర్‌లో నివాసముంటూ దారుణాలకు పాల్పడ్డాడు. ఏమైనా సందేహాలుంటే డైరెక్ట్‌గా ఫోన్‌ చేయొచ్చని, నెంబర్‌ ఇస్తూ అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడినట్లు గుర్తించారు పోలీసులు. అమ్మాయిలు ఫోన్‌ చేయగానే, తన అసలు రూపాన్ని బయటపెట్టేవాడు నగేష్‌. అసభ్యంగా మాట్లాడుతూ, శారీరక వాంఛ తీర్చాలని వేధించేవాడు. బాధితురాలితో ఇలాగే మాట్లాడటంతో షీ టీమ్‌కు కంప్లైంట్ చేసింది విద్యార్ధిని. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పక్కా ఆధారాలతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం…

Loading...
Unable to load recommendations.
Follow Us