Hyderabad: బట్టల షాపు బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా.. ఫోటోలు, వీడియోలు సేకరించి…

|

May 26, 2022 | 5:49 PM

బంజారాహిల్స్ లోని ఓ దుస్తుల షాపు బాత్రూంలో సీక్రెట్ కెమెరా ఉంచిన వైనం బయటపడింది. అందులో పనిచేసే క్లీనింగ్ బాయ్ ఈ పని చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Hyderabad: బట్టల షాపు బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా.. ఫోటోలు, వీడియోలు సేకరించి...
Hidden Camera
Follow us on

మహిళలూ బీ అలెర్ట్.. మీరు షాపింగ్ మాల్స్.. సినిమా థియేటర్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌కి వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వాష్‌రూమ్‌కి వెళ్లినప్పుడు.. చుట్టూ జాగ్రత్తగా పరిశీలించండి. ఏ కీచకుడో మీపై సీక్రెట్‌గా కన్నేసి ఉండవచ్చు. ఆపై ఆ ఫోటోలు, వీడియోలతో మీకు బెదిరింపులు రావొచ్చు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనే జరిగింది. బంజారాహిల్స్(Banjara Hills) లోని ఓ బట్టల షాపు బాత్​రూంలో సీక్రెట్‌గా కెమెరా పెట్టి మహిళ ఫోటోలు, వీడియోలు తీశాడు ఓ క్లీనింగ్​ బాయ్​.  ఏడాది క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ.. బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఈ రోజు కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దుస్తులు షాప్‌లో పనిచేసే మహిళ ఫోన్‌కి తన అర్ధనగ్న దృశ్యాలు వచ్చాయి. అందులో పనిచేసే క్లీనింగ్ బాయ్ మొబైల్ నుంచి ఈ వీడియోలు వచ్చినట్లు మహిళ గుర్తించింది. ఫోటోలు, వీడియోలు పంపించడమే కాకుండా ఆమెను వేధించడంతో బాధితురాలు పోలీసులకు కంప్లైంట్ చేసింది.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు… క్లీనింగ్ బాయ్ బెంగాల్​కు చెందిన వాడిగా గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. క్లీనింగ్ బాయ్ కేవలం దుస్తుల షాపులో పనిచేసే తోటి మహిళల చిత్రాలే సేకరించాడా లేకపోతే డ్రెస్సింగ్ రూమ్​లోనూ కెమెరాలేమైనా పెట్టాడా…?  ఫోన్ ద్వారా చిత్రాలు సేకరించాడా లేకపోతే సీక్రెట్ సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశాడా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..