హైదరాబాద్‌లో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. అమీర్‌పేటలోని ఓ హోటల్‌లో విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఏడుగురు విదేశీ యువతులతో పాటు ఐదుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ప్రధాన నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.