5.90 కిలోల హెరాయిన్..41.3కోట్ల రూపాయల విలువజేసే మత్తు పదార్థం. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి.. భారీగా హెరాయిన్ సీజ్‌చేశారు DRI అధికారులు. మలావి నుండి దోహా మీదుగా హైదరాబాద్‌కు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆ మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో.. తనిఖీలు చేశారు DRI అధికారులు. ఆమె లగేజీ బ్యాగ్‌లో సీక్రెట్‌గా దాచిన హెరాయిన్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
దాని విలువ 41.3కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. నిషేధిత హెరాయిన్‌ను తీసుకొచ్చిన ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అధికారులు. నార్కోటిక్స్ ఫీల్డ్-టెస్టింగ్ కిట్‌లతో పరీక్షించినప్పుడు.. ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 కింద ఆమెను అరెస్ట్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని DRI పోలీసులు తెలిపారు.
భారతీయురాలైన సదరు మహిళ, మాలావి నుంచి హెరాయిన్ తీసుకొచ్చి హైదరాబాద్‌లో ఇచ్చేలా కాంట్రాక్ట్ కుదుర్చుకున్నట్లు డీఆఆర్‌ఐ అధికారులు తెలిపారు. నిందితురాలిని డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ హెరాయిన్‌ను ఎక్కడ, ఎవరికి చేరవేయాలనుకున్నారనే దానిపై ఆ మహిళను విచారిస్తున్నట్లుగా డీఆఆర్‌ఐ అధికారులు వెల్లడిచారు.
హెరాయిన్ చేరవేస్తే డబ్బు అందిస్తామంటూ మహిళను ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. శంషాబాద్ విమానాశ్రయంలో నిర్దేశించిన ప్రాంతానికి తీసుకెళ్లాలని ఆమెకు స్మగ్లర్లు సూచించినట్లుగా తెలుస్తోంది. ఆమె తరలిస్తున్న సూటికేసులో అంత విలువైన సరుకు ఉన్నట్లుగా తెలియకపోవచ్చని అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో హెరాయిన్‌ను తీసుకునే వాళ్ల వివరాలు సైతం నిందితురాలికి తెలియవని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం