తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రాగల మూడు గంటల సమయంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, నారాయణ పేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, భువనగిరి వంటి జిల్లాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముంది. ఈ జిల్లాల్లో ప్రజలు వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది.ఈ ప్రాంతాలలో తక్కువ తీవ్రత కలిగిన వర్షాలు కురవొచ్చు. వర్షాలు సాధారణ స్థాయిలో ఉండే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయని కూడా సూచించారు. వర్షాల కారణంగా పలు చోట్ల పంటలపై ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, నల్లగొండ జిల్లాలలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాలు భారీగా పడితే, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, రోడ్లపై నీరు పేరుకోవడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వర్షాల ప్రభావం వల్ల రహదారులపై రద్దీ పెరుగుతుంది, ముఖ్యమైన జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించవచ్చు. అందువల్ల ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రజలు ఆలస్యం కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలను గమనించి, ప్రజలు ఆచితూచి వ్యవహరించడం అవసరం. అత్యవసర పరిస్థితులు తప్ప ఇతర పనుల కోసం బయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరా లోపాలు రావచ్చు కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ప్రభుత్వం సంబంధిత విభాగాలు వర్షాల కారణంగా తలెత్తే ఇబ్బందులను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు నీటి ముంపు పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు పంటలను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. రైతులు వర్షాల ప్రభావం పంటలపై ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని పంటలను రక్షించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడం అవసరం.ఇలాంటి వర్ష పరిస్థితులలో నదులు, చెరువులు, కుంటలు, కాల్వలు వంటి నీటి మూలాలు పరవళ్లు తొక్కే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు ప్రస్తుత పరిస్థితులను జాగ్రత్తగా గమనించి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది చదవండి: అందరూ దేవుడ్ని మొక్కేందుకు వెళ్తే.. వీరు మాత్రం గుడి యెనక చేసే పనులివి
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి