Hyderabad: ఒక్క ఫోన్ కాల్ తో ఆఫీసును హడలెత్తించిన మాజీ ఉద్యోగి.. ఏం చేశాడంటే.

సాధారణంగా ఒక కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తర్వాత పాత సంస్థ గురించి పెద్దగా పట్టించుకోరు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే ఓ ప్రబుద్ధుడు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. పాత కంపెనీతో ఎలాంటి వివాదం తలెత్తిందో ఏమో కానీ మొత్తం ఆఫీసునే హడలెత్తించాడు. ఒక చిన్న ఫోన్‌ కాల్‌తో అందరినీ ఉరుకులు, పరుగులు పెట్టేలా చేశాడు...

Hyderabad: ఒక్క ఫోన్ కాల్ తో ఆఫీసును హడలెత్తించిన మాజీ ఉద్యోగి.. ఏం చేశాడంటే.
Hyderabad

Updated on: May 04, 2023 | 3:35 PM

సాధారణంగా ఒక కంపెనీ నుంచి ఉద్యోగం మానేసిన తర్వాత పాత సంస్థ గురించి పెద్దగా పట్టించుకోరు. తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే ఓ ప్రబుద్ధుడు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. పాత కంపెనీతో ఎలాంటి వివాదం తలెత్తిందో ఏమో కానీ మొత్తం ఆఫీసునే హడలెత్తించాడు. ఒక చిన్న ఫోన్‌ కాల్‌తో అందరినీ ఉరుకులు, పరుగులు పెట్టేలా చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి గుర్తు తెలియని ఓ వ్యక్తి బెదిరింపు కాల్‌ చేశాడు. ఆఫీసులో బాంబు పెట్టారంటూ, వెంటనే అందరూ పారిపోవాలని ఫోన్‌ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన కంపెనీ యాజమజాన్యం పోలీసులకు సమాచారం అందించింది. టీఎసీఎస్‌కు చేరుకున్న పోలీసులు వెంటనే ఆఫీసంతా తనిఖీలు చేపట్టారు. అనంతరం ఎలాంటి బాంబు లేదనే నిర్ధారణకు వచ్చాయి.

అయితే ఈ ఫేక్‌ కాల్ ఎవరు చేశారన్న దానిపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజం తెలిసింది. ఆ కాల్‌ చేసిన వ్యక్తి మరెవరో కాదని, టీఎసీఎస్‌ కంపెనీ మాజీ ఉద్యోగమని తేల్చారు. సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అసలు బెదిరింపు కాల్‌ చేయడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్న కోణంలో విచారణ చేపట్టనున్నారు. ఆఫీసులో ఎలాంటి బాంబు లేదని తేలడంతో ఉద్యోగులు, యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..