హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా కేంద్రాలు.. ఎక్కడెక్కడంటే..!

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు తొలిసారి స్వచ్ఛందంగా కరోనా కేంద్రానికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారు.

హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా కేంద్రాలు.. ఎక్కడెక్కడంటే..!
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 7:09 AM

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు తొలిసారి స్వచ్ఛందంగా కరోనా కేంద్రానికి వెళ్లి ఉచితంగా పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న హైదరాబాద్‌లో 11 ఉచిత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన వివరాలను ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. కరోనా లక్షణాలున్న వారు అక్కడికి వెళ్లి ఉచితంగా పరీక్ష చేయించుకోవచ్చునని ఆయన తెలిపారు.

ఉచిత కరోనా పరీక్ష కేంద్రాలివే: 1. కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్ 2.నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రి 3.ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ 4.అమీర్ పేటలోని నేచుర్ క్యూర్ ఆసుపత్రి 5.మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్ 6.ఎర్రగడ్డలోని ఆయుర్వేదిక్ హాస్పిటల్ 7.రామంతపూర్‌లోని హోమియోపతి హాస్పిటల్ 8.చార్మినార్‌లోని నిజామియా టిబ్బి హాస్పిటల్ 9.కొండాపూర్‌లోని ఏరియా ఆసుపత్రి 10.వనస్థలి పురంలోని ఏరియా ఆసుపత్రి 11.నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్‌

కాగా తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య  17,357కు చేరింది. వీరిలో 8,082 మంది కరోనాను జయించగా.. 267 మంది మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 9,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Latest Articles
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్రదాడి ముప్పు.. పాకిస్థాన్ నుంచే స్కెచ్..
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్రదాడి ముప్పు.. పాకిస్థాన్ నుంచే స్కెచ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
ఆదివాసీల వినూత్న నిరసన.. రోడ్లు వేస్తేనే ఓటు అంటూ డిమాండ్..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
టైటానిక్‌ నటుడు 79 ఏళ్ల బెర్నార్డ్ హిల్ మృతి..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
లక్నోపై ఘన విజయంతో రాజస్థాన్‌కు షాకిచ్చిన కోల్‌కతా..
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
'12 ఎంపీలు గెలిపించండి.. రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం'.. కేటీఆర్
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
మీ ఓటు వేరొకరు వేశారా.. ఓటు హక్కు కోల్పోయినప్పుడు ఇలా చేయండి..
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
కన్నప్ప కోసం అక్షయ్‌ ఎన్ని కోట్లు అందుకుంటున్నాడో తెలుసా.?
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
భలేగా ఉంది ఉపాయం..! సైకిల్‌ వాషింగ్‌ మెషిన్‌తో బట్టలు సాఫ్‌ సఫాయ్
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
హైదరాబాద్‌తో పోరుకు సిద్ధమైన ముంబై.. విజయాలతో వీడ్కోలు పలికేనా
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..
ఐస్ క్రీం తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకండి..