Hyderabad: వామ్మో ఇదేందిరా నాయనా.. ఇంకెప్పుడైనా ఐస్ క్రీం తింటారా..?

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత ఫేమస్ బేకరీ, రెస్టారెంట్లకు వెళ్లాలన్నా జనాలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పేరు మోసిన బేకరీలు, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో బయటపడుతున్న నిజాలు అలా ఉన్నాయి మరి.

Hyderabad: వామ్మో ఇదేందిరా నాయనా.. ఇంకెప్పుడైనా ఐస్ క్రీం తింటారా..?
Unhygienic Food
Follow us

|

Updated on: May 06, 2024 | 7:07 AM

ప్రజంట్ ఎండాకాలం. సూర్యుడు చెలరేగిపోతున్నాడు. వేడి తాపానికి ఐస్ క్రీం తినాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇప్పుడున్న సిట్యువేషన్‌కి పిల్లలే కాదు పెద్దలు కూడా ఐస్ క్రీం తినాలని ఉబలాటపడుతుంటారు. కానీ ఇప్పుడున్న కల్తీ కాలంలో.. ఏం తినాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిందే. ఇక శుభ్రత అంటారా..? దాని గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది. అలాగనీ గల్లీ స్టోర్స్, షాపుల్లో మాత్రమే కాదు.. బడా, బడా బేకరీలు, హోటళ్లలో కూడా ఇదే పరిస్థితి. అవును.. అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా సిటీలోని కరాచీ బేకరీ, క్లోవ్ వెజిటేరియన్ ఫైన్ డైన్, క్రీమ్ స్టోన్ అవుట్ లెట్లలో పరిస్థితులు చూసి అధికారులే విస్తుపోయారు.

కరాచీ బేకరీలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కొన్ని కాలం చెల్లిన పదార్థాలను అధికారులు గుర్తించారు. రూ.5,200 విలువైన రస్క్‌లు, స్వీట్లు, చాక్లెట్ కేకులు, బిస్కెట్లు, టోస్ట్‌లు, బన్స్‌… ఎక్స్‌పైరీ డేట్ అయిపోయినట్లు అధికారులు గర్తించారు. మరోవైపు లేబుల్స్ లేని చాలా ప్రొడక్ట్స్‌ గుర్తించారు. FSSAI రూల్స్ ఉల్లంఘన నేపథ్యంలో యాజమాన్యానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు.

హిమాయత్‌నగర్‌లోని క్లోవ్‌ వెజిటేరియన్‌ ఫైన్‌ డైన్‌లో అయితే పరిస్థితి మరింత దారుణం. ఐస్‌క్రీమ్‌ స్టోరేజీ యూనిట్‌లో బతికున్న బొద్దింకలను ఫుడ్ సేఫ్టీ గుర్తించారు. మసాలాలు, శాండ్‌విచ్ బ్రెడ్, చీజ్, సిరప్, బ్రౌన్ షుగర్ వంటి ఎక్స్‌పైరీ డేట్ ఎండ్ అయిన  ఉత్పత్తులను కూడా గుర్తించారు. అంతేకాకుండా ఫంగల్ సోకిన క్యారెట్లు, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన వెజిటబుల్ బిర్యానీతో పాటు కిచెన్‌లో కనీస శుభ్రత లేకపోవడంతో .. అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఇక హిమాయత్ నగర్‌లోని క్రీమ్ స్టోన్ అవుట్ లెట్‌లో గడువు ముగిసిన ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. మొజాంజాహి మార్కెట్‌లో ఉన్న బిలాల్ ఐస్ క్రీమ్ స్టోర్‌లో ఫేక్ బ్రాండ్ వాటర్ బాటిల్స్ యూజ్ చేయడమే కాకుండా.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఆ షాప్ నడిపిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు.. శరత్ సిటీ మాల్‌లో ఫైర్ ఫ్లై రెస్టారెంట్, ఎయిర్ లైవ్, టాకో బెల్ అవుట్ లెట్లలో అధికారులు తనిఖీలు నిర్వహించి వాటి ఓనర్లకు నోటీసులు ఇచ్చారు.

Latest Articles
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
సీఎం జగన్ కాన్వాయ్ అడ్డుకున్న ఎన్నారై.. పోలీసులపై వైసీపీ ఆగ్రహం..
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
కొత్తగా పెళ్లి అయ్యిందా.? గోవాకు హనీమూన్‌ ట్రిప్‌
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది
రూ.30 లక్షల హోమ్‌ లోన్‌పై ఎంత ఈఎంఐ చెల్లించాలి?వడ్డీ ఎంత అవుతుంది