దేశంలో అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ.. ఐఐటీ HYDలో చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ బస్సులు!

డ్రైవర్‌ అవసరం లేకుండా వాటంతట అవే నడిచే బస్సులను ఐఐటీ హైదరాబాద్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అటానమస్‌ నావిగేషన్‌ డేటా అక్విజిషన్‌ సిస్టం టెక్నాలజీని ఉపయోగించి టిహాన్ సంస్థ ఈ డ్రైవర్‌ లెస్‌ బస్సులను తయారు చేసింది. ప్రస్తుతం ఈ బస్సులు ఐఐటీ క్యాంపస్‌లో రోజువారీ సేవలను అందిస్తున్నాయి. దీంతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్‌ బస్సులను అందుబాటులోకి తెచ్చిన గనతను ఐఐటీ హైదరాబాద్‌ సాధించింది.

దేశంలో అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ.. ఐఐటీ HYDలో చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ బస్సులు!
Driverless Buses At Iit Hyd

Updated on: Aug 13, 2025 | 5:44 PM

ఐఐటీ లోని ప్రత్యేక పరిశోధన విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఆన్‌ అటానమస్‌ నావిగేషన్‌ (టిహాన్‌)’ ఈ డ్రైవర్‌ లెస్‌ బస్సులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఈ వాహనాలు డ్రైవర్‌ లేకుండా పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. ఐఐటీ హైదరాబాద్‌ ప్రస్తుతం ఈ బస్సుల్లో రెండు వేరియంట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ఒకటి ఆరు సీట్లు, మరోకటి పద్నాలుగు సీట్లు కలిగి ఉన్నాయి. ఇప్పటికే క్యాంపస్‌లో సేవలు అందిస్తున్నాయి.

ఐఐటీ క్యాంపస్‌లోని విద్యార్థులు, అధ్యాపకుల ఈ డ్రైవర్‌లెస్‌ వాహనాలలోనే ప్రధాన గేటు నుంచి వర్సిటీ లోని అన్నిచోట్లకు ప్రయాణిస్తూన్నారు.ఈ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణీకుల నుంచి చాలావరకు సానుకూల స్పందన వచ్చిందని.. 90శాతం మంది ఈ బస్సుల్లో ప్రయాణాన్ని సంతృప్తి చెందినట్టు టిహాన్ పేర్కొంది.

ఈ బస్సుల్లో అమర్చబడిన అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్‌ బస్సు వేగాన్ని కంట్రోల్‌ చేయడానికి ఉపయోగపడుతాయి. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో దానికి ఏవైనా అడ్డుగా వస్తే వాటిని గుర్తించి, సురక్షితమైన దారిలో ప్రయాణించేందుకు ఇవి ఉపయోగపడుతాయి.

ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ఈ TiHAN సంస్థ డ్రైవర్‌ లెస్‌ బస్సులనే కాకుండా దేశంలో మొట్టమొదటి స్వయంప్రతిపత్తి నావిగేషన్ టెస్ట్‌బెడ్‌ను కూడా అభివృద్ధి చేసింది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు స్వియ డ్రైవింగ్‌ వ్యవస్థలను రోడ్లపై ఉపయోగించే ముందు వాటిని టెస్ట్‌ చేయడానికి ఈ నావిగేషన్‌ టెస్ట్‌బెడ్‌ ఉపయోగపడుతుంది.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.