AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetable Prices: దీపావళి వేళ సామాన్యులపై మరో బండ.. పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయి. టమాటా, ఉల్లిగడ్డ వంటి నిత్యావసర కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. ఎల్‌నినో ప్రభావం, రవాణా ఖర్చులు వల్ల వెజిటెబుల్ ధరలు పెరుగుతున్నాయి.

Vegetable Prices: దీపావళి వేళ సామాన్యులపై మరో బండ.. పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..?
Vegetable Prices
Venkatrao Lella
|

Updated on: Nov 07, 2026 | 9:18 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు దీపావళి పండక్కి ముందు పెరుగుతున్నాయి. నవంబర్ 8వ తేదీన దీపావళి పండుగ కాగా.. ముందే ధరలు ఎగబాకుతున్నాయి. ఎల్‌నివో ప్రభావంతో పాటు ఏపీలో వరుస తుఫాన్లు అర్నబ్, మురసు ప్రభావంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో కూరగాయల పంటకు నష్టం వాటిల్లడం, పంట ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు ఎగబాకుతున్నాయి. దీంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు పండగ వేళ షాక్ అవుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి వంటి నిత్యావసర కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో కిలో కొనాల్సింది బదులు పావుకిలోతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం పెరుగుతోంది. వాతావరణ మార్పులు, పంట దిగుబడి తగ్గడం, రవాణా ఖర్చులు పెరగడం వంటివి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు రూ.500తో సంచులు నిండా కూరగాయలు ఇంటికి తెచ్చుకునే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు అంతే మొత్తంతో చాలా తక్కువ పరిమాణంలో కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దళారుల దోపిడీని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

హైదరాబాద్‌లో కూరగాయల రేట్లు ఇవే..

కూకట్‌పల్లిలోని మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కిలో టమాట రూ. 23, వంకాయ రూ.18, బెండకాయ రూ.45, పచ్చి మిర్చి రూ. 45, బజ్జి మిర్చి రూ. 55, కాకరకాయ రూ. 23, బీరకాయ రూ. 23, క్యాబేజీ రూ. 10, ఫ్రెంచ్ బీన్స్ రూ. 55, క్యారెట్ రూ. 35, గోబీపువ్వు రూ. 25, దొండకాయ రూ. 18 పలుకుతున్నాయి. కిలో చిక్కుడుకాయ రూ. 35, గోరుచిక్కుడు రూ. 35, క్యాప్సికం రూ. 40, ఆలుగడ్డ రూ. 18, సొరకాయ రూ. 15, పొట్లకాయ రూ. 23, దోసకాయ రూ. 21, లోకల్ కీరా రూ. 18, ఇటాలియన్ కీరా రూ. 28, అలసందలు రూ. 23కి విక్రయిస్తున్నారు. బీట్ రూట్ రూ. 18, కంద రూ. 45, చామగడ్డ రూ. 35, చిలగడదుంప రూ. 35, ఉల్లిగడ్డ రూ. 40, ఉల్లిపొరక రూ. 55, గుమ్మడికాయ కిలో రూ. 25, పర్వల్ రూ. 28, పల్లికాయలు రూ. 55, పచ్చి చింతకాయలు రూ. 45, కరివేపాకు కిలో రూ. 80కే లభిస్తున్నాయి. పచ్చి అరటికాయ ఒక్కొక్కటి రూ. 8 నుండి 9, ముల్లంగి రూ. 6 నుండి 8, మునగకాయ రూ. 6 నుండి 8, అలాగే మామిడికాయ రూ. 15 నుండి 20చ డజను నిమ్మకాయల ధర రూ. 50 నుండి 60 వరకు అమ్ముడవుతున్నాయి. పాత అల్లం కిలో రూ. 180, కొత్త అల్లం రూ. 120, వెల్లుల్లి రూ. 260, చింతపండు రూ. 160, పండు మిర్చి రూ. 80, ఉసిరి రూ. 43, ఎండు మిర్చి కిలో రూ. 280, బొప్పాయి కిలో రూ. 50, 200 గ్రాముల పుట్టగొడుగుల ప్యాకెట్ ధర రూ. 50కి విక్రయిస్తున్నారు.

విజయవాడలో నేటి రేట్లు ఇవే..

కిలో టామాట రూ.36, వంగ రూ.30, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.42, కాకర రూ.36, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.45, దొండ రూ.24, బంగాళదుంప రూ.26, ఉల్లిపాయలు రూ.40, గోరుచిక్కుడు రూ.34, దోస రూ.26, సోర రూ.15, చిక్కుళ్లు రూ.60, బీర రూ.38, చామదుంప రూ.36, బీట్ రూట్ రూ.36, కీరదోస రూ.44, బీన్స్ రూ.85, క్యాప్చికం రూ.55,. అలసందలు రూ.40, చిలకడదుంప రూ.44, కొత్తిమీర రూ.42 పలుకుతున్నాయి.

Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..
ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళీ థ్రిల్లర్ డ్రామా..
దీపావళి వేళ సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కూరగాయల ధరలు..
దీపావళి వేళ సామాన్యులకు బ్యాడ్‌న్యూస్.. పెరిగిన కూరగాయల ధరలు..
ఆకిబ్ నబీ విధ్వంసం.. 7 ఏళ్ల తర్వాత చెత్త రికార్డులో కివీస్..!
ఆకిబ్ నబీ విధ్వంసం.. 7 ఏళ్ల తర్వాత చెత్త రికార్డులో కివీస్..!
వెంటనే పూజలు చేయకపోతే పెద్ద ప్రమాదం ఉందన్నాడు.. వాళ్లు నమ్మారు..
వెంటనే పూజలు చేయకపోతే పెద్ద ప్రమాదం ఉందన్నాడు.. వాళ్లు నమ్మారు..
అమెరికా యుద్ధ భయంతో ఇరాన్ గజగజ.. ప్రజలకు అయోడిన్ మాత్రల పంపిణీ!
అమెరికా యుద్ధ భయంతో ఇరాన్ గజగజ.. ప్రజలకు అయోడిన్ మాత్రల పంపిణీ!
వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
వైట్ హౌస్‌లో దీపావళి.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా బహుకరణ!
17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..
17 ఏళ్లకే కెప్టెన్‌గా బుడ్డోడు.. కొత్త అవతారంలో వైభవ్ సూర్యవంశీ..
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..వారికి SHRC నోటీసులు
రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్..వారికి SHRC నోటీసులు
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చేటప్పుడు కళ్లను ఎలా కాపాడుకోవాలి?
దీపావళి సంబరాల్లో టపాసులు కాల్చేటప్పుడు కళ్లను ఎలా కాపాడుకోవాలి?
CID మెరుపు దాడులు.. ధరణి అక్రమాల కేసులో మరో ఐదుగురు అరెస్ట్
CID మెరుపు దాడులు.. ధరణి అక్రమాల కేసులో మరో ఐదుగురు అరెస్ట్