Free Wifi Viral Tweet: ఉచిత వైఫై వాడుతున్నారా.? అయితే జర భద్రం.. మీ ఫోన్ హ్యాక్ కావడం ఖాయం.! ఇలా తరచుగా సైబర్ పోలీసులు ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ కొంతమంది జనాలు ఉచిత వైఫైనే ఉపయోగించుకుంటున్నారు. ఇక వారిలో అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు వినూత్నంగా ఓ ట్వీట్ చేశారు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా డైలాగులు, వెరైటీ మీమ్స్, సరికొత్త వీడియోలతో యువతకు ట్రాఫిక్ రూల్స్‌పై సైబరాబాద్ పోలీసులు తరచూ అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ఉచిత వైఫై వల్ల వచ్చే ప్రమాదాల విషయంలో ప్రజలు పలు జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్న ట్వీట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
వాగు దగ్గర ఒక అడవి పంది నీరు త్రాగుతున్నట్లుగా వీడియోలో చూడవచ్చు. అప్పుడే రెప్పపాటులో ఓ మొసలి దానిపై దాడి చేసింది. ఎలాగోలా ఆ మొసలి నోటికి చిక్కకుండా ఈ అడవి పండి తప్పించుకోగలుగుతుంది. ఉచిత వైఫై వాడటం వల్ల వచ్చే ప్రమాదాలను చెబుతూ.. ఈ వీడియోను పోస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు.. ‘*ఉచిత వైఫై ఒక కనిపించని ఏర.. దాన్ని వాడితే.. మీకు ఇలాంటి ముప్పులు తప్పవు* అని క్యాప్షన్ ఇచ్చారు.
Beware of free #Wi-fi
*ఉచిత వైఫై ఒక కనిపించని ఏర.. దాన్ని వాడితే.. మీకు ఇలాంటి ముప్పులు తప్పవు*@cyberabadpolice @TelanganaCOPs @hydcitypolice @RachakondaCop @CYBTRAFFIC @EOWCyberabad @sheteamcybd @SCSC_Cyberabad pic.twitter.com/Ut0gOfX4jp— Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) March 21, 2021
చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!
భారీ పైథాన్‌తో ఫన్నీ గేమ్.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న స్నేక్ క్యాచర్.. వైరల్ వీడియో.!
తలపై కొమ్ముతో భయంకర ఆకారం.. బెంబేలెత్తించే దృశ్యం.. ఇంతకీ అది దెయ్యమేనా.!