యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

సీఎం కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా కొండచుట్టు 5.2 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. కాగా.. యాదాద్రి గుట్ట చుట్టూ దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో రింగ్‌రోడ్డును నిర్మిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. దీంతో.. […]

యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు

Edited By:

Updated on: Aug 17, 2019 | 2:58 PM

సీఎం కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం బాలాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా కొండచుట్టు 5.2 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న రింగ్‌రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. కాగా.. యాదాద్రి గుట్ట చుట్టూ దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో రింగ్‌రోడ్డును నిర్మిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇందుకు సంబంధించిన టెండర్లను ప్రభుత్వం ఇటీవలే ఆమోదించింది. దీంతో.. పనులు వేగవంతమయ్యాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us