Makar Sankranti: పల్లె బాట పట్టిన నగర వాసులు.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..

సంక్రాంతి నేపథ్యంలో.. హైదరాబాద్‌-విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. రహదారిపై నిన్న ఉదయం నుండి వాహనాలు భారీగా బారులు తీరుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ బాగా పెరిగింది.

Makar Sankranti: పల్లె బాట పట్టిన నగర వాసులు.. హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్..
Highway Rush

Edited By: TV9 Telugu

Updated on: Jan 16, 2024 | 1:12 PM

సంక్రాంతి నేపథ్యంలో.. హైదరాబాద్‌-విజయవాడ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. రహదారిపై నిన్న ఉదయం నుండి వాహనాలు భారీగా బారులు తీరుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలతో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వాహనాల రద్దీ బాగా పెరిగింది. అయితే హైవేపై పొగమంచు కారణంగా రోడ్డు కనిపించక..వాహనదారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఫాస్ట్ టాగ్ దగ్గర ఇబ్బందులు తలెత్తితే తొందరగా వాహనాలు పోవడానికి వీలుగా హ్యాండ్ లీడర్ సౌకర్యం అందుబాటులో ఉంచారు. నిత్యం ఈ టోల్‌ఫ్లాజా నుంచి 38 వేల వాహనాలు వెళ్తాయి. ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపు అయ్యిందని టోల్‌ప్లాజా సిబ్బంది చెబుతున్నారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ, కర్నూలు మీదుగా ఏపీకి భారీగా వాహనాలు వెళ్తున్నాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, ఉప్పల్‌ బస్టాప్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌తోపాటు నగరశివారులోని పలు బస్టాప్‌ల నుంచి ప్రయాణికులు సొంతూర్లకు బయల్దేరారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ వెళ్లే పంతంగి టోల్‌గేట్‌తోపాటు కర్నూలువైపు వెళ్లే షాద్‌నగర్‌ టోల్‌గేట్‌ దగ్గర కూడా వాహనాల రద్దీ పెరిగింది. ఆర్టీసీ స్పెషల్‌ బస్సులను కూడా నడుపుతోంది. అటు సికింద్రా బాద్‌, కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ దృష్టిలో పెట్టుకొని విజయవాడ, విశాఖపట్నానికి సంక్రాంతి స్పెషల్‌ ట్రైన్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ. కానీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు.

వీడియో చూడండి..

ఇదిలాఉంటే.. ప్రయాణికులతో హైదరాబాద్‌ లోని MGBS బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఊళ్లకు వెళ్లే వారితో బస్టాండ్ రద్దీగా మారింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చేరుకుంటుండంతో బస్టాండ్ పరిసరాల్లో సందడి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..