Hyderabad: గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదం ఘటన.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..

బాధిత కుటుంబాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయని భట్టి విక్రమార్క తెలిపారు.

Hyderabad: గుల్జార్‌హౌస్‌ అగ్ని ప్రమాదం ఘటన.. పరిహారం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..
Bhatti Vikramarka

Updated on: May 18, 2025 | 3:51 PM

గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మృతులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఈ క్రమంలో.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహా, పొన్నం ప్రభాకర్‌ ఉస్మానికియా వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాల సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రులు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గుల్జార్‌ హౌస్‌ ప్రమాదం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల జరిగిందని అధికారులు భావిస్తున్నట్లు తెలిపారు.

అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి, కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయని భట్టి విక్రమార్క తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే సీఎం అధికారులతో మాట్లాడారన్నారు. సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సీఎం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయ అందిస్తామని తెలిపారు.

చార్మినార్ గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం తర్వాత రెస్క్యూలో ఆలస్యం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయితే ఘటనపై రాజకీయాలు చేయవద్దని, రెస్క్యూ ఆపరేషన్‌లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.

క్షతగాత్రులను, మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ కోరారు.

అగ్నిప్రమాద ఘటన జరగడం దురదృష్టకరమని ఎంపీ అసదుద్దీన్ పేర్కొన్నారు. మృతులకు సంతాపం తెలిపారు హైదరాబాద్‌ ఎంపీ.. బాధిత కుటుంబం వందేళ్లకుపైగా ఇక్కడే నివసిస్తోందని.. ఈ ఘటన జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..