Hyderabad: బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది.. కానీ లిఫ్ట్ రాలేదు.. పాపం ఆయన వచ్చిందనుకుని

హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలోని చంద్రాయణగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వృద్ధుడు ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్‌ గుంతలో పడి మరణించాడని చెబుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి ...

Hyderabad: బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది.. కానీ లిఫ్ట్ రాలేదు.. పాపం ఆయన వచ్చిందనుకుని
Old City Lift Incident

Edited By: Ram Naramaneni

Updated on: Nov 14, 2025 | 8:13 PM

హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంలోని చంద్రాయణగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధుడు అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం వృద్ధుడు ఐదో అంతస్తు నుంచి లిఫ్ట్‌ గుంతలో పడి మరణించాడని చెబుతున్నారు. కూతుర్ని కలవడానికి ఆ అపార్ట్మెంట్‌కు వచ్చి లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాడు. లిఫ్ట్ బటన్ నొక్కగానే డోర్ ఓపెన్ అయింది. అయితే లిఫ్ట్ మాత్రం రాలేదు. డోర్ ఓపెన్ అవ్వడంతో..  లిఫ్ట్ వచ్చిందని భావించి వృద్ధుడు లోపల అడుగు పెట్టినప్పుడే ఐదో అంతస్తు నుంచి కిందకు పడ్డాడు. అతను అక్కడికక్కడే మృతి చెందగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్ద పంచనామా చేసారు. లిఫ్ట్ సిబ్బంది నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అని అనుమానిస్తున్నారు.

స్థానికులు భవన యజమాని నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం లిఫ్ట్ పరిస్థితిని పరిశీలిస్తూ పూర్తి విచారణ చేస్తున్నారు. లిఫ్ట్‌ను సరిగా పరిక్షించి, భవన యజమాని బాధ్యతలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో చంద్రాయణగుట్టలోఅపార్ట్మెంట్ నివాసులలో ఆందోళన నెలకొంది. లిఫ్ట్ భద్రత, నిర్వహణపై అవగాహన కల్పించడం అవసరమని అధికారులు సూచిస్తున్నారు. లిఫ్ట్ సాంకేతిక పరిపాలనలో లోపం ఉన్నట్లయితే మరే విధమైన ప్రమాదం రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.