
హైదరాబాద్‌లో కల్తీ కల్లు కెమికల్ కలకలం రేపింది. కల్తీ కల్లు తయారీకి వినియోగించే 560 కిలోల క్లోరల్ హైడ్రేట్‌ను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయినపల్లి డైరీఫామ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేయగా.. రాము గౌడ్ అనే వ్యక్తి కారులో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బి గ్రామానికి చెందిన రాము గౌడ్.. కొన్నేళ్లుగా బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో.. ముంబాయికి చెందిన రాజుబాయ్ అనే వ్యక్తి దగ్గర క్లోరల్ హైడ్రేట్‌ను కిలో 200 రూపాయలకు కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఏడుగురు వ్యక్తులకు 400 రూపాయలకు విక్రయిస్తున్నట్లు చెప్పారు ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్. నిందితుడి నుండి ఓ కారు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక.. రాముగౌడ్ ఇచ్చిన సమాచారంతో మిగతావారిపైనా కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..