హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. కమలనాథుల్లో సరికొత్త జోష్..!

ఇండి కూటమి సర్‌ ఆందోళనలకు కౌంటర్ ఇస్తోంది బీజేపీ. అమిత్ షా మహాపాదయాత్రతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నాలు చేస్తే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్‌లో జంగ్ సైరన్ మోగిస్తోంది. రేపు MJ మార్కెట్ దగ్గర బహిరంగసభలో అమిత్ షా ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర.. కమలనాథుల్లో సరికొత్త జోష్..!
Amit Shah Hyderabad Visit

Updated on: Nov 02, 2026 | 7:13 AM

మహాపాదయాత్రతో హైదరాబాద్‌లో గర్జించేందుకు తెలంగాణ బీజేపీ రెడీ అయింది. సర్‌ ప్రక్రియపై ఇండియా కూటమి, సీజేపీ నిరసనలను తిప్పికొట్టాలన్న జాతీయ పార్టీ ఆదేశాలతో తెలంగాణలో మహాపాదయాత్రకు సిద్ధమైంది రాష్ట్ర బీజేపీ.. లోక్‌తంత్ర బచావో-అరాచకత హటావో పేరుతో బీజేపీ నిర్వహించే పాదయాత్రలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పాల్గొంటారు. సోమవారం మధ్యాహ్నం (నవంబర్ 2) అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 1.30గంటలకు చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం హోటల్‌ ఐటీసీ కాకతీయలో లంచ్, పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజంజాహి మార్కెట్ వరకు మహాపాదయాత్రలో పాల్గొంటారు. మొజంజాహి మార్కెట్ దగ్గర భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.

అమిత్‌షాతోపాటు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, టీబీజేపీ చీఫ్ ఎన్‌.రామచందర్‌రావు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు ఇందులో పాల్గొననున్నారు. ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం-అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ నినాదంతో కొనసాగే ఈ పాదయాత్ర మోజంజాహి మార్కెట్‌ వరకు కొనసాగనుంది.

అమిత్ షా పాదయాత్రకు ప్రజలను తరలించేందుకు బీజేపీ నేతలు ప్లాన్ చేశారు.. గ్రేటర్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 20 వేల మందిని సమీకరించేందుకు ప్లాన్ చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌ లోక్ సభ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలను తరలించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహంచారు.

ఢిల్లీ రాంలీలా మైదానంలో ఓటు బచావో – దేశ్ బచావో పేరుతో కాంగ్రెస్ చేసిన నిరసనకు కౌంటర్ గా దేశవ్యాప్తంగా బీజేపీ ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే.. అమిత్ షా రాకతో తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ వచ్చింది. హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాష్ట్ర నేతలకు అమిత్ షా కీలక సూచనలు చేసే అవకాశం ఉందంటున్నారు కమలనాథులు..

Loading...
Unable to load recommendations.
Follow Us