రేపే తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలు..!

|

Jun 01, 2019 | 1:55 PM

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేషన్ తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలను రేపు అనగా జూన్ 2న నిర్వహించనున్నారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో వ్యక్తుల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 65 గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. మరోవైపు గ్రామీణ ఆవిష్కరణలను, ఆలోచనలను పంచుకుందాం అంటూ నిర్వాహకులు అందరిని ఆహ్వానించారు. ఇక బేగంపేటలోని పీపుల్స్ ప్లాజాలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ఈ ప్రదర్శన జరగనుంది. […]

రేపే తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలు..!
Follow us on

తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేషన్ తెలంగాణ గ్రామీణ ఆవిష్కరణ సంబురాలను రేపు అనగా జూన్ 2న నిర్వహించనున్నారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో వ్యక్తుల జీవితాలను అత్యంత ప్రభావితం చేసిన 65 గ్రామీణ ఆవిష్కరణల ప్రదర్శన జరగనుంది. మరోవైపు గ్రామీణ ఆవిష్కరణలను, ఆలోచనలను పంచుకుందాం అంటూ నిర్వాహకులు అందరిని ఆహ్వానించారు. ఇక బేగంపేటలోని పీపుల్స్ ప్లాజాలో రేపు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటలకు వరకు ఈ ప్రదర్శన జరగనుంది.

అటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రేపు తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు.