
హైదరాబాద్, నవంబర్ 23: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ డ్రైవ్‌లో భాగంగా మొత్తం 424 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. వీరిలో 300 ద్విచక్ర వాహనదారులు, 18 ఆటోలు, 99 కార్లు, 7 హెవీ వాహనదారులపై కేసులు నమోదయ్యాయి. బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా కేసులను వర్గీకరిస్తే — 361 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య, 43 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య, 20 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml మధ్య ఆల్కహాల్ సేవించి పట్టుబడ్డారు.
వీరందరినీ చట్టపరంగా కోర్టుకు హాజరుపర్చనున్నట్లు సంబంధిత పోలీసులు అధికారులు తెలిపారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉంది.
గత వారం (17.11.2025–22.11.2025)లో మొత్తం 358 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీరిలో 304 మందికి జరిమానా, 22 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 32 మందికి జరిమానా, జైలు శిక్ష విధించబడినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.https://tv9telugu.com/telangana
1678662,1678712,1678718,1678648