Hyderabad: విషాదం నింపిన ఆదివారం.. స్మిమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి!

హైదరాబాద్‌లో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సరదాగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి..

Hyderabad: విషాదం నింపిన ఆదివారం.. స్మిమ్మింగ్‌ పూల్‌లో పడి మూడేళ్ల బాలుడు మృతి!
Boy Dies After Falling Into Swimming Pool

Updated on: Jan 04, 2026 | 6:47 PM

హైదరాబాద్‌, జనవరి 4: నగరంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సరదాగా అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిన మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి మృతి చెందిన బాలుడు అర్జున్‌ (3) దుర్మరణం చెందాడు. అసలేం జరిగిందంటే..

బాలుడి తల్లిదండ్రులు చింతల్‌లో నివసిస్తుంటారు. వీకెండ్‌ వరుస సెలవులు రావడంతో బాలుడిని హైదర్‌నగర్‌లోని వెర్టెక్స్‌ ప్రైమ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఆడుకుంటుండగా అనుకోకుండా అర్జున్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయాడు. అయితే సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో అది ఎవరూ గమనించలేదు. దీంతో కొద్ది సేపటికే నీటిలో మునిగి బాలుడు మరణించాడు. కొద్దిసేపటికి బాలుడు అర్జున్‌ను నీటిపై తేలుతూ ఉండటం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కనీసం ఆదివారం వంటి వీకెండ్‌ సమయాల్లో అయినా స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద కేర్‌ టేకర్స్‌ కనిపించకపోవడం, అపార్ట్‌మెంట్‌ సీసీ కెమెరాల వద్ద పర్యవేక్షకులు లేకపోవడం వల్లనే తన కుమారుడిని కోల్పోవాల్సి వచ్చిందని బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోధన అందరినీ కంటతడి పెట్టించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.