Hyderabad: అయ్యో భగవంతుడా.. తొలి ఏకాదశి పండగ పూట ఆ ఇంట చిట్టి దీపం ఆరిపోయింది

|

Jun 29, 2023 | 9:56 PM

ఈ ఫోటోలో మధ్యలో ఉన్న బాలుడిని చూడండి. చిన్నోడు 3 ఏళ్లే. ఏంతో యాక్టివ్. ఆ బజార్లో అందరికీ అతడు అంటే ఎంతో ఇష్టం. కానీ తొలి ఏకాదశి రోజు.. పండగపూటే ఆ బుడ్డోడికి నూరేళ్లు నిండిపోయాయి.

Hyderabad: అయ్యో భగవంతుడా.. తొలి ఏకాదశి పండగ పూట ఆ ఇంట చిట్టి దీపం ఆరిపోయింది
Boy Dies
Follow us on

డియర్ పేరెంట్స్.. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా..? అయితే వారిని జాగ్రత్తగా చూసుకోండి. కంటికి రెప్పలా కాపాడుకుండి. వారికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలీదు. కనిపించిన ప్రతి దాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. ఏ సీసా కనిపించినా దాన్ని పాల డబ్బానే అనుకుంటారు. ఆ సమయంలో మనం అలెర్ట్‌గా లేకపోతే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనియా గాంధీ నగర్‌లో అలాంటి విషాద ఘటనే వెలుగుచూసింది.  అప్పటివరకు ఆడుతూ.. పాడుతూ తిరిగిన కుర్రాడు.. అంతలోనే విగతజీవిగా మారిపోయాడు. అందుకు కారణం కొబ్బరి ముక్క. అవును.. కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుపోవడంతో.. ఊపురి ఆడక మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నిరుగా విలపిస్తున్నారు.

తొలి ఏకాదశి పండగ పూట కొబ్బరి కాయ చిన్నోడి పాలిట యమ పాశమైంది. 3 ఏళ్లు కూడా పూర్తిగా నిండకుండానే బాలుడు ఈ లోకాన్ని వీడాడు. నిజమే అన్ని సార్లు మనం వారి పక్కన ఉండలేం. కానీ పెట్రోల్, డీజిల్, క్రిమి సంహారక మందులు, కరెంట్ సంబంధిత వస్తువులు, జెట్ కాయిల్స్, ట్యాబ్లెట్స్ వంటివి పిల్లలకి అందకుండా దూరంగా పెట్టండి. ఈ మాత్రం జాగ్రత్తలు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో మినిమం తీసుకోవాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..