Hyderabad News: రోడ్డుపై వంద రూపాయల నోటు కనిపించిందంటే.. అటూ ఇటూ చూసి చటుక్కున జేబులో వేసుకునే రోజులివి. కానీ, ఇక్కడో యువకుడు మాత్రం లక్షలు విలువ చేసే బంగారం దొరికితే.. ఏ మాత్రం ఆశపడలేదు. మనది కానీ వస్తువును సొంత చేసుకోవాలనుకుకోవడం తప్పని భావించాడు. వెంటనే తనకు దొరికిన 10 తులాల బంగారు నగలను భద్రంగా పోలీసులకు అప్పగించాడు. బాధితుల వివరాలు సేకరించిన పోలీసులు.. బంగారు నగలను బాధితులకు అప్పగించారు. నిజాయితీ చాటుకున్న యువకుడిని పోలీసులు, గోల్డ్ తిరిగి పొందిన దంపతులు ఎంతగానో ప్రశంసించారు. ఈ కాలంలో ఇలాంటి మనుషులు కూడా ఉండటం నిజంగా అరుదని కొనియాడారు. అయితే, ఇదంతా జరిగింది.. ఏక్కడో మారుమూల పల్లెనో, కుగ్రామమో కాదండోయ్. మన హైదరాబాద్ మహానగరంలోనే.. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. యువకుడి నిజాయితీతో మరోమారు హైదరబాదీల నిజాయితీ కూడా కీర్తి కెక్కింది.
వివరాల్లోకెళితే.. హైదరాబాద్‌లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సమయంలో రోడ్డుపై యువకుడికి బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగ్ కనిపించింది. దానిని చేతికి తీసుకున్న యువకుడు.. ఓపెన్ చేసి చూస్తే బంగారు నగలు ఉన్నాయి. ఎవరో పోగొట్టుకున్నారని, వారి సొమ్మును వారికి అందించాలని భావించాడు. వెంటనే సమీపంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. పోలీసులకు జరిగిన విషయం చెప్పాడు. తనకు దొరికిగిన బంగారు నగలను పోలీసులకు అప్పగించాడు. బాధితులకు నగలను అప్పగించాల్సిందిగా కోరాడు. పోలీసులు వెంటనే వివరాలు సేకరించి.. బాధితులను గుర్తించారు. వారికి సమాచారం చేరవేశారు. బాధితులకు బంగారు నగలను అప్పగించారు. యువకుడికి దొరికిన బంగారు నగలు 10 తులాల ఉంటుందని పోలీసులు తెలిపారు.
Also read:
Andhra Pradesh: ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.. బహుమతులు గెలుచుకోండి.. పోలీసుల వినూత్న ఆఫర్..