ఇంట్లో భార్య, రైల్వే ట్రాక్‌పై భర్త.. దంపతుల ఆత్మహత్య.. పోలీసుల విచారణలో అసలు నిజాలు!

హైదరాబాద్ లాలాగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా లక్ష్మి ఆత్మహత్య చేసుకోగా, భార్య మృతిని తట్టుకోలేక భర్త శరణప్ప బలవన్మరణానికి పాల్పడ్డాడు. దంపతులు కొద్దిసేపటి వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబ కలహాలకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇంట్లో భార్య, రైల్వే ట్రాక్‌పై భర్త.. దంపతుల ఆత్మహత్య.. పోలీసుల విచారణలో అసలు నిజాలు!
Lalaguda Couple

Edited By:

Updated on: Sep 10, 2026 | 2:46 PM

హైదరాబాద్: లాలాగూడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిని తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన లక్ష్మి (25), శరణప్ప (30) దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుటున్నారు. అయితే గత కొన్ని రోజులు కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో లక్ష్మి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త శరణప్ప తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. భార్య మృతిని తట్టుకోలేక శరణప్ప నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు కొద్దిసేపటి వ్యవధిలోనే మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే లక్ష్మి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటి? కుటుంబ కలహాలకు దారితీసిన పరిస్థితులు ఏంటి? శరణప్ప ఆత్మహత్యకు ముందు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఘటనలపై లాలాగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ విషాద ఘటనలకు సంబంధించి పూర్తి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us