త్వరలో గచ్చిబౌలి నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు… 31కి.మీ మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం

|

Apr 19, 2021 | 5:14 PM

Metro Corridor: శంషాబాద్‌ అంర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం. అయితే దాని కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌..

త్వరలో గచ్చిబౌలి నుంచి విమానాశ్రయం వరకు మెట్రో రైలు... 31కి.మీ మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం
Metro Corridor
Follow us on

Metro Corridor: శంషాబాద్‌ అంర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైలును ఏర్పాటు చేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం. అయితే దాని కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. మెట్రో రెండో దశలో భాగంగా ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌ గురించి గచ్చిబౌలి ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు సుమారు 31 కిలోమీటర్ల పొడవునా మెట్రో కారిడార్‌ను నిర్మించేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించడంతో పాటు ఢిల్లీ మెట్రో రైలు సంస్థతో డీపీఆర్‌ను సిద్ధం చేసి ఉంచారు. అయితే ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థకు ఒకేసారి రూ. 1000 కోట్లు కేటాయించడంతో ఇక మెట్రో అధికారులు రెండో దశ మెట్రోపై కసరత్తు మొదలు పెట్టారు.

శంషాబాద్‌ అంటే ఇప్పటి వరకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర బిందువు మాత్రమే. ఇక నుంచి విమానయాన రంగంలోనే కాదు విభిన్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు సైతం కేంద్రంగా మారనుంది. త్వరలోనే గచ్చిబౌలి ఐటీ కారిడార్‌ నుంచి విమానాశ్రయం వరకు మెట్రో పరుగులు పెట్టనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించగా, పనులను ప్రారంభించేందుకు మెట్రో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, శంషాబాద్‌ విమానాశ్రయంలో కొత్తగా 1500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఏరో సిటీ నూతన వ్యాపార, వాణిజ్య సముదాయాలకు కేంద్రంగా మారనుంది. ఇవన్నీ ప్రారంభమై కార్యకలాపాలు మొదలు పెడితే ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు కేంద్రంగా మారిన గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ తరహాలోనే శంషాబాద్‌ మరో బిజినెస్‌ డిస్ట్రిక్ కేంద్రంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు.

అత్యంత కీలకమైన ఐటీ కారిడార్‌

కాగా, మొదటి దశలో మూడు కారిడార్‌లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో పరుగులు పెడుతుండగా, రెండో దశలో మరో 80 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో అత్యంత కీలకమైన కారిడార్‌ ఐటీ కారిడార్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మార్గానికి అత్యంత ప్రాధాన్యనిచ్చారు. ఇందు కోసం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్‌ మెట్రో రైలుతో పాటు హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ), టీఎస్‌ఐఐసీ, జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు వంటి సంస్థలతో కలిసి ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించారు. సంస్థలతో కలిసి చేపట్టే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడం ద్వారా నగరం నుంచి విమానాశ్రయం వరకు మెరుగైన అంత్యంత ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

ఇవీ చదవండి: AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెలవులు

ప్రమాదకరంగా మారిన సెకండ్‌ వేవ్‌ కరోనా.. ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ :నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్