Uttarakhand Floods: హైదరాబాద్ యువతులు సురక్షితం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తిరుగు పయనం..

G. Kishan Reddy: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన హైదరాబాద్ యువతులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు

Uttarakhand Floods: హైదరాబాద్ యువతులు సురక్షితం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తిరుగు పయనం..
Floods

G. Kishan Reddy: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన హైదరాబాద్ యువతులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. మల్కాజిగిరి ఆర్.కె.నగర్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు.. దసరా సెలవులకు ఉత్తరాఖండ్ వెళ్లారు. అకస్మాత్తుగా అక్కడ వరదలు ముంచెత్తడంతో గత నాలుగు రోజులుగా లేమన్ ట్రీ ప్రాంతంలో చిక్కుకున్నారు. అక్కడ తాము ఒక బిల్డింగ్ మూడవ అంతస్తుపై చిక్కుపోయామని..రెండవ అంతస్తు వరకు నీళ్లు చేరడంతో బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నామని కాపాడాలంటూ కోరారు. తమను కాపాదాటానికి ఎవరు ఇక్కడ అధికారులు రావడంలేదని.. తమను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ సీఎంఓకు ట్విట్ ద్వారా కోరారు. కాగా.. తమ పరిస్థితి గురించి ట్వీట్ చేయడంతో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వెంటనే ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ అధికారులు.. హైదరాబాదీ యువతులను కాపాడారు. లేమన్ ట్రీ ప్రాంతంలోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో వరదల్లో చిక్కుకున్న సుష్మ మిత్రబృందం దగ్గరకు వెళ్లి సహాయ బృందాలు కాపాడాయి. దీంతో తమ వాహనంలో సుష్మ, ఆమె స్నేహితులు ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. తమను కాపాడేందుకు చర్యలు తీసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.

కేరళ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలకు వణికిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు, వరదల ధాటికి కేరళలో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.

Also Read:

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీలు.. నాలుగు రోజులుగా హోటల్లో పడిగాపులు

Academy Deposits Case: తెలుగు అకాడమీ డిపాజిట్ల కేసులో మరొక కీలక నిందితుడి అరెస్ట్

 

Click on your DTH Provider to Add TV9 Telugu