Hyderabad: నర్స్‌ శిరీష హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..! పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు

హైదరాబాద్‌ శివార్లలో సంచలనం సృష్టించిన శంషాబాద్‌ నర్స్‌ శిరీష హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి బీహార్‌కు చెందిన సైనా ఉల్లాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడు ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad: నర్స్‌ శిరీష హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌..! పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
Shamshabad Nurse Murder Case

Updated on: Aug 31, 2026 | 2:02 PM

తుక్కుగూడలో నర్సును దారుణంగా చంపేశాడో కిరాతకుడు. హాస్పిటల్‌ రూంలో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి ప్రాణాలు తీశాడో రాక్షసుడు. అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో రూమ్‌‌‌‌లోకి ప్రవేశించిన సనావుల్లాఖాన్‌ అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించడంతో ఇనుప రాడ్‌‌‌‌తో ముఖంపై బాదాడు. బాధితురాలు కేకలు వేయడంతో విషయం బయటకు వస్తుందనే భయంతో గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లికి యువతి ఏడు నెలలుగా తుక్కుగూడలోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పని చేస్తోంది. ఎప్పటిలానే రాత్రి నిద్రపోయిన అమ్మాయి ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో తోటి సిబ్బంది రూమ్‌కి వెళ్లి తలుపులు కొట్టారు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీ లో నుంచి చూసి షాకయ్యారు. ముఖంపై తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పహడీషరీఫ్​ పోలీసులు డాగ్, క్లూస్ టీమ్‌‌‌‌తో స్పాట్‌లో ఆధారాలు సేకరించారు. ఇనుప రాడ్డుతో ముఖంపై బలంగా కొట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాళ్లపై కూడా తీవ్ర గాయాలున్నాయి. బాధితురాలి దుస్తులు, శరీరంపై ఉన్న గాయాలను బట్టి లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డెడ్ ​బాడీని పోస్ట్‌‌‌‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అనంత పక్కా సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

బీహార్‌‌‌‌‌‌‌‌లోని రుదౌలి గ్రామానికి చెందిన మహ్మద్ సనావుల్లా ఖాన్‌ తుక్కుగూడలోని హాస్పిటల్‌ సమీపంలో ఉన్న షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. రోజు ఆ షాపు ముందు నుంచే నర్సులంతా తమ రూమ్‌లకు వెళ్లేవారు. కొద్ది రోజులుగా యువతి వచ్చిపోయే టైమ్ గమనించాడు. శుక్రవారం (ఆగస్టు 28)అర్ధరాత్రి ఆమె తన రూమ్‌‌‌‌లో ఒంటరిగా ఉందని, పక్కన రూముల్లో కూడా ఎవరూ లేరని తెలుసుకున్న సనా ..కిటికీ ఓపెన్‌ చేసి రూమ్‌‌‌‌లోకి ఎంటరయ్యాడు. అలికిడి విన్న ఆమె కళ్లు తెరిచి చూసి అరవబోయింది. వెంటనే ఆమె నోరు మూసిన నిందితుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రాడ్‌‌‌‌‌‌‌‌తో ఆమె ముఖంపై చితకబాదాడు. ఆమె స్పృహ కోల్పోయాక అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తర్వాత గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే, యువతి తండ్రి చనిపోవడంతో తల్లి కూలీ పనులు చేసుకుంటూ ఆమెతో పాటు మరో కొడుకును పోషించుకుంటోంది. ఘటన జరిగిన రోజు రాత్రి 10.30గంటల వరకు కుటుంబసభ్యులతో నర్సు వీడియో కాల్‌ మాట్లాడిందని చెబుతున్నారు బంధువులు. తెల్లారేసరికి ప్రాణాలతో లేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి ఉద్యోగం కోసం వచ్చిన తన బిడ్డను ఇంత దారుణంగా చంపిన వాడిని వదలొద్దు ​.. చంపెయ్యండి అంటూ రోధిస్తోంది.

తుక్కుగూడలో నర్స్ దారుణ హత్యకు గురైన ఘటనపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు అధికారులు, ప‌‌‌‌హాడిష‌‌‌‌రీఫ్ సీఐ , ఇతర అధికారులతో ఫోన్‌‌‌‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

విషయం తెలుకున్న స్థానిక బీజేపీ నేతలు ఉస్మానియా మార్చరికి చేరుకుని ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. నర్సు మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, అసలు నిజాలను వెలుగులోకి తేవాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామంటున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us