Ganesh Visarjan 2021: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం.. రేపు విచారిస్తామన్న సుప్రీంకోర్టు..

|

Sep 15, 2021 | 1:04 PM

Ganesh Visarjan 2021: హైదరాబాద్ పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం నాడు విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Ganesh Visarjan 2021: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం.. రేపు విచారిస్తామన్న సుప్రీంకోర్టు..
Supreme Court Ganesha
Follow us on

Ganesh Visarjan 2021: హైదరాబాద్ పరిధిలోని వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించిన పిటిషన్‌పై గురువారం నాడు విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హుస్సేన్ సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి మినహాయింపుని ఇవ్వాలంటూ అభ్యర్థించింది. ట్యాంక్ బండ్ మీదుగా నిమజ్జనం చేసేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్‌లో జీహెచ్ఎంసీ కోరింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది జీహెచ్ఎంసీ. ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టును కోరారు. అయితే, ఈ పిటిషన్‌ను పరిశీలించిన చీఫ్ జస్టిస్ట్ ఎన్వీ రమణతో కూడిన బెంచ్.. గురువారం నాడు విచారిస్తామని స్పష్టం చేశారు. సీజేఐ నిర్ణయంతో ఈ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.

హుస్సేన్‌సాగర్‌తో పాటు చెరువుల్లో పర్యావరణహితమైన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని, జీహెచ్ఎంసీని ఆదేశించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా హుస్సేన్ సాగర్‌లో పర్యావరణానికి హానీ కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ కలిగిన విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ ఆదేశించింది. అయితే, నిమజ్జనం సమయం సమీపిస్తున్న తరుణంలో హైకోర్టు ఇలా తీర్పునివ్వడంతో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ షాక్ అయ్యింది. ఈ ఒక్క ఏడాదికి హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతివ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రివ్యూ పిటిషన్‌ను సైతం హైకోర్టు కొట్టిపడేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందేనంటూ కుండబద్దలుకొట్టింది. తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది జీహెచ్ఎంసీ. మరి సుప్రీంకోర్టు గురువారం నాడు ఎలాంటి తీర్పును ప్రకటిస్తుందో వేచి చూడాలి.

Also read:

APPGECET 2021: ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..

Pooja Hegde : సల్మాన్‌తో పూజాహెగ్డే సినిమా ఆగిపోయిందంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Telangana Crime Rate: తెలంగాణలో పెరిగిన నేరాల సంఖ్య.. ఒక్క ఏడాదిలో ఎన్నికేసులు నమోదయ్యాయో తెలిస్తే షాక్ అవుతారు..