Hyderabad: HCU కీచక ప్రొఫెసర్‌ రవి రంజన్‌పై సస్పెన్షన్ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన వీసీ..

హెచ్‌సీయూలో కీచక ప్రొఫెసర్ రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తూ వర్సిటీ వీసీ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితమే విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో హెచ్‌సీయూ వీసీ చర్చలు జరిపారు.

Hyderabad: HCU కీచక ప్రొఫెసర్‌ రవి రంజన్‌పై సస్పెన్షన్ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన వీసీ..
hyderabad central university
Follow us

|

Updated on: Dec 03, 2022 | 4:13 PM

హెచ్‌సీయూలో కీచక ప్రొఫెసర్ రవి రంజన్‌ను సస్పెండ్ చేస్తూ వర్సిటీ వీసీ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది సేపటి క్రితమే విద్యార్థులు, విద్యార్థి సంఘాలతో హెచ్‌సీయూ వీసీ చర్చలు జరిపారు. లిఖిత పూర్వక హామీ ఇవ్వాలన్న స్టూడెంట్స్ డిమాండ్ మేరకు సస్పెష్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్‌సీయూ ప్రొఫెసర్ రవిరంజన్ నిన్నరాత్రి థాయిలాండ్ విద్యార్ధినికి హిందీ నేర్పుతానని చెప్పి తన క్వార్టర్ కి తీస్కెళ్లారు. అక్కడ మద్యం తాగించే యత్నం చేసి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రతిఘటించడంతో.. ఆమెపై చేయి చేసుకున్నారు. ఈ ఘటన తర్వాత ఆమెను కార్లో తీసుకొచ్చి వర్సిటీ గేటు ముందు వదిలేశారు. ఈ విషయంపై ఆమె పోలీస్ కంప్లయింట్ చేయడంతో పాటు వీసీకి కూడా మెయిల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రవిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. రవి రంజన్ లాంటి కీచక ప్రొఫెసర్లు వర్సిటీలో మరికొందరు ఉన్నారని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేశామని, వాళ్లపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్.

హైదరాబాద్‌ యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగికదాడియత్నం సంచలనంగా మారింది. వర్సిటీల్లో జరుగుతున్న అరాచకాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని కోరుతున్నారు విద్యార్థులు, విద్యార్థిసంఘం నేతలు. అరెస్టులు, కేసులతోనే సరిపెట్టకుండా కఠిన శిక్షపడేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకుని ఉంటే.. ఇప్పుడీ ఘటన జరిగి ఉండేది కాదంటున్నారు విద్యార్ధులు. ఇదంతా నిన్నటి నుంచే జరుగుతున్నా వర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రొఫెసర్లే తమపై ఇలా లైంగికదాడికి యత్నిస్తారని ఊహించలేకపోయామంటూ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇంతజరిగినా.. కాలేజీ యాజమాన్యం మాత్రం అండగా నిలవడం లేదని ఆరోపించారు.

ఎన్నోఆశలతో యూనివర్సిటీకి వచ్చానని.. వచ్చిన నాలుగురోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడం దారుణమంటోంది ఫస్టియర్‌ స్టూడెంట్‌. యూనివర్సిటీల్లో ఇలాంటివి చాలా కామన్‌గా మారిపోయాయని ఆవేదన చెందారు స్టూడెంట్స్. మీడియా ఇలాంటివాటిపై ఫోకస్‌ చేయాలని కోరారు. హైదరాబాద్‌ వర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగికదాడి యత్నానికి నిరసనగా.. చేసిన ఆందోళనకు అధికారులు దిగొచ్చినట్లు చెబుతున్నారు స్టూడెంట్‌ నేతలు. ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ చేసినట్లు ప్రకటిస్తూ లెటర్‌ చదివి వినిపించారని చెప్పారు. యూనివర్సిటీల్లో సైన్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న విద్యార్థినులపై ఇలాంటి అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు విద్యార్థి నేతలు. లైంగిక వేధింపులపై వర్సిటీ కమిటీలు చర్యలు తీసుకోకవపోడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక ప్రొఫెసర్‌ రవిరంజన్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు గచ్చిబౌలి ఏసీపీ రఘునందన్. ఆయనపై 353, 354-A సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..