Telangana: వాటర్ పైప్ నుంచి వింత శబ్దాలు.. మరమ్మతు చేసేందుకు వచ్చిన సిబ్బందికి మైండ్ బ్లాంక్!

|

Apr 21, 2022 | 9:31 PM

వాటర్ పైప్ మెయిన్ వాల్వ్‌కు లీకేజీ ఏర్పడటంతో మరమ్మతు చేయాలని సిబ్బందికి సమాచారం అందించారు అక్కడున్న అధికారులు...

Telangana: వాటర్ పైప్ నుంచి వింత శబ్దాలు.. మరమ్మతు చేసేందుకు వచ్చిన సిబ్బందికి మైండ్ బ్లాంక్!
Main Valve
Follow us on

వాటర్ పైప్ మెయిన్ వాల్వ్‌కు లీకేజీ ఏర్పడటంతో మరమ్మతు చేయాలని సిబ్బందికి సమాచారం అందించారు అక్కడున్న అధికారులు. మెయిన్ వాల్వ్‌ను బాగు చేసేందుకు సిబ్బంది అందులోకి దిగారు. అంతే! అక్కడ కనిపించిన సీన్‌తో వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని వనపర్తి జిల్లా నాగవరం వద్ద ఉన్న రామన్‌పాడ్ మెయిన్ వాల్వ్‌కు లీకేజీ ఏర్పడింది. దీనితో సిబ్బంది దానిని బాగు చేసేందుకు అందులోకి దిగారు. అంతే! అక్కడ వారికి కుప్పలు తెప్పలుగా పాములు కనిపించాయి. ఒక్కసారిగా దడుసుకున్న సిబ్బంది.. జాగ్రత్తగా అక్కడ నుంచి బయటికి వచ్చి.. స్థానిక స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణ సాగర్‌కు సమాచారం అందించారు. అతడు మెయిన్ వాల్వ్ దగ్గరకు చేరుకుని.. 3 పాములు, సుమారు 50 పాము పిల్లలను బయటికి తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.