Voter ID Card: హైదరాబాద్ జిల్లా పరిధిలో జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సారాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ప్రజలను కోరారు. భారత ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2022 విడుదల చేసిన నేపథ్యంలో ఓటరు జాబితా పై ఏమైన అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఈ నెల 27, 28 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో బి.ఎల్.ఓ లు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్‌తో అందుబాటులో ఉంటారని ఓటరు జాబితాలో తప్పుగా ఉన్న పేరు, అడ్రస్ ఇతర ఏవైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో సవరణ చేసుకునే వెసులుబాటు ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వివరించారు.
బుధవారం కమిషనర్ స్వీప్ కమిటీ సభ్యులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పై వర్చువల్ మీటింగ్ జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటరు నమోదు పేర్లు, అడ్రస్ ఒక నియోజక వర్గం నుండి మరొక నియోజకవర్గానికి మార్పు కోసం సంబంధిత ఇ.అర్.ఓ లకు, గానీ www.nvsp.in, లేదా ఓటరు నమోదు యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చన్నారు. నూతన ఓటరు నమోదుకు ఫారం-6, ఓటరు జాబితా నుండి పేరు తొలగింపు కోసం ఫారం-7, ఓటరు జాబితాలో తప్పుల సవరణకు ఫారం-8, అదే నియోజకవర్గంలో అడ్రస్ మార్పుకు ఫారం-8A వినియోగంచుకోవాలన్నారు. సభ్యులు సూచించిన సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.
నియోజక వర్గంలో ఓటురు నమోదు అభ్యంతరాలు సరిచేసుకొనేవిధంగా ఆడియో ద్వారా తెలుగు, ఇంగ్లీష్ ఉర్దూ భాషలో ప్రచారం చేస్తున్నట్లు మొబైల్ యస్.ఏం.యస్ ద్వారా, బస్ షెల్టర్ హోల్డింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. దేవాలయాల్లో, మసీద్, చర్చిలలో ప్రార్థన సమయంలో అనౌన్స్ చేయించడమే కాకుండా అవగాహన కోసం కరపత్రాల పంపిణీ, పోలీస్ పీస్ కమిటీ సభ్యులకు, అపార్ట్ మెంట్, కాలనీ కమిటీలకు సభ్యులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా సోషల్ మీడియా, ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్స్ అప్‌తో పాటుగా రేడియో, టి విల ద్వారా అంతేకాకుండా కాలేజ్, పాఠశాలల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా కృషిచేస్తామన్నారు.
Also Read: అభివృద్ధికి ఆమడ దూరంలో అమెరికాలోని ఓ గ్రామం.. ఇప్పటికీ గాడిదలపైనే ప్రయాణం