Hyderabad: పవర్‌గ్రిడ్‌ కార్యాలయంలో కలకలం.. మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా కెమెరా!

హైదరాబాద్‌ మహా నగరంలోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్‌ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్‌ ఫోన్‌ ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఫ్లోర్‌ అటెండెంట్‌ భారత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోన్‌లోని సమాచారాన్ని వెలికితీసేందుకు కేసును సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

Hyderabad: పవర్‌గ్రిడ్‌ కార్యాలయంలో కలకలం.. మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా కెమెరా!
Hidden Mobile Phone

Updated on: Oct 24, 2026 | 1:04 PM

హైదరాబాద్‌: నగరంలోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్‌ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్‌ ఫోన్‌ ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఫ్లోర్‌ అటెండెంట్‌ భారత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోన్‌లోని సమాచారాన్ని వెలికితీసేందుకు కేసును సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

వాష్‌బేసిన్‌ కింద ఫోన్‌ ఏర్పాటు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 13న పవర్‌గ్రిడ్‌ కార్యాలయంలోని మహిళల వాష్‌రూమ్‌లో వాష్‌బేసిన్‌ కింద డబుల్‌ సైడెడ్‌ టేప్‌తో అతికించిన మొబైల్‌ ఫోన్‌ను ఓ మహిళా ఉద్యోగిని గుర్తించారు. ఫోన్‌ ఎవరిదని ప్రశ్నించగా, అటెండెంట్‌ భారత్‌ దానిని లాక్కొని అక్కడి నుంచి పరుగెత్తాడు. దీంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు ఆరా తీయడంతో అసలు యవ్వారం బయటపడింది. దీంతో మహిళా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్రమత్తమైన ఉద్యోగులు సహోద్యోగులు, భద్రతా సిబ్బంది సహకారంతో అతడిని పట్టుకున్నారు. ఫోన్‌లోని వీడియోలను పరిశీలించేందుకు ప్రయత్నించగా, పిన్‌లాక్‌ ఉన్న ఫోల్డర్‌ కనిపించినట్లు బాధితురాలు ఫిర్యాదులో వెల్లడించారు. అనంతరం నిందితుడు ఫోన్‌ను నేలకేసి కొట్టినట్లు వెల్లడించారు.

సైబర్‌ క్రైమ్‌ పోలీసుల దర్యాప్తు!

ఈ ఘటనపై గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో అక్టోబర్‌ 13న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఫ్లోర్‌ అటెండెంట్‌ భారత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఫోన్‌లో ఉన్న సమాచారాన్ని సాంకేతికంగా విశ్లేషించి, ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరపాలని ఫిర్యాదుదారులు కోరారు. మహిళల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫోన్‌లోని వీడియోల స్వభావం, ఇతరుల ప్రమేయం వంటి అంశాలపై పోలీసుల దర్యాప్తులో మరింత స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us