నగర వాసులకు ఉపశమనం.. పలుచోట్ల భారీ వర్షం..

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వరుణుడు భాగ్యనగర వాసులకు ఆదివారం ఉపశమనం కల్గించాడు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్‌, నాగోలు, వనస్థలిపురం, ఉప్పల్‌, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్, జవహర్‌ నగర్‌, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పలుచోట్ల విద్యుత్ […]

నగర వాసులకు ఉపశమనం.. పలుచోట్ల భారీ వర్షం..

Edited By:

Updated on: May 31, 2020 | 6:18 PM

గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో వరుణుడు భాగ్యనగర వాసులకు ఆదివారం ఉపశమనం కల్గించాడు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం తర్వాత.. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్‌, నాగోలు, వనస్థలిపురం, ఉప్పల్‌, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, ఈసీఐఎల్, జవహర్‌ నగర్‌, బీహెచ్‌ఈఎల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరుతోంది.