Hanamkonda: నువ్వే నా మిత్రవింద అంటూ ఆయాతో హెడ్ మాస్టర్ రోత వేషాలు.. కట్ చేస్తే..

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఓ హెడ్‌మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. పాఠశాలలో పనిచేస్తున్న ఆయాను ప్రేమ పేరుతో వేధించిన హెడ్‌మాస్టర్.. ఆమెను లోబర్చుకునేందుకు ఏఐ యాప్ ద్వారా ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు నకిలీ ఫొటోలు సృష్టించి ఇతరులకు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Hanamkonda: నువ్వే నా మిత్రవింద అంటూ ఆయాతో హెడ్ మాస్టర్ రోత వేషాలు.. కట్ చేస్తే..
Bairanpally Government School

Edited By:

Updated on: Oct 08, 2026 | 4:54 PM

“నువ్వే నా మిత్రవింద.. గత జన్మలో మనిద్దరం ప్రేమికులం.. మళ్లీ ఏకమవుదాం” అంటూ ఓ మహిళా ఉద్యోగిని వెంటపడిన హెడ్‌మాస్టర్.. ఆమెను లోబర్చుకునేందుకు ఏకంగా ఏఐ సాయంతో ఆమెతో చనువుగా ఉన్నట్లు ఫొటోలు సృష్టించాడు. వాటిని ఇతరులకు పంపించి ఆమెపై అనుమానాలు కలిగించేలా ప్రయత్నించాడు. అయితే ఆ మహిళ ఊహించని విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలపై హెడ్‌మాస్టర్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. అదే పాఠశాలలో హెడ్‌మాస్టర్‌గా పనిచేస్తున్న కుమారస్వామి.. అక్కడ పనిచేస్తున్న ఓ ఆయాపై ఆసక్తి పెంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమెను ఎలాగైనా తనకు దగ్గర చేసుకోవాలని ప్రయత్నించిన హెడ్‌మాస్టర్.. వింత వింత మాటలతో ఆమెను నమ్మించే ప్రయత్నం చేశాడు. తామిద్దరం గత జన్మలో ప్రేమికులమని.. తనకు జ్ఞానదృష్టి ఉందని చెప్పినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆమె అంగీకరించకపోవడంతో.. చివరకు ఏఐ సాయంతో ఫొటోలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌మాస్టర్ వ్యవహారం బయటపడింది. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించేలా రకరకాల ఫొటోలను ఏఐ యాప్ ద్వారా రూపొందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ ఫొటోలను గ్రామంలోని కొందరికి పంపించి.. ఆమె తనతో చనువుగా ఉండేదని చెప్పినట్లు తెలుస్తోంది. తద్వారా ఆమెపై ఇతరులకు అనుమానాలు కలిగించేలా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏఐ ద్వారా రూపొందించిన ఫొటోలు బాధితురాలి దృష్టికి రావడంతో వివాదం మరింత ముదిరింది. ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు హెడ్‌మాస్టర్ కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకుని అతడిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us