Telangana: ఉప్పల్-ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌పై కేంద్రం కీలక నిర్ణయం

|

Jun 24, 2024 | 10:03 PM

ఉప్పల్-ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్‌ రద్దు చేస్తూ కొత్త టెండర్లు పిలవాలని కేంద్రమంత్రి గడ్కరీ ఆదేశించారు. ఆ డీటేల్స్ ఏంటో తెలుసుకుందాం పదండి..

Telangana:  ఉప్పల్-ఘట్‌కేసర్‌ ఫ్లైఓవర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
Komatireddy Venkata Reddy - Nitin Gadkari
Follow us on

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలో రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్ రింగ్‌ రోడ్డు వంటి అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్- విజయవాడ హైవేను 6 లేన్ల రోడ్డుగా మార్చాలని మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై త్వరలో మీటింగ్ పెట్టి పరిశీలిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. అలాగే రీజినల్‌ రింగ్ రోడ్డు అంశంపై త్వరలోనే రివ్యూ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం చేసిన 16 రహదారులపై నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.

భారత్‌ మాల స్థానంలో కొత్త ప్రాజెక్టు తీసుకొస్తున్నామని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారని వెల్లడించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. అలాగే ఉప్పల్‌- ఘట్‌కేసర్‌ ఫ్లై ఓవర్‌ పనులు గత ఆరేళ్లలో 40శాతం మాత్రమే పూర్తయ్యాయని గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆ వెంటనే ఫ్లై ఓవర్‌ నిర్మాణంపై ఉన్న టెండర్లను వెంటనే టర్మినెట్‌ చేసి… కొత్త టెండర్లకు ప్రకటన ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ…పార్టీలకు అతీతంగా సమస్యలపై ఎవరొచ్చి అడిగినా వెంటనే పరిష్కరిస్తారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. హైవే మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా కూడా పేరు పొందారని గుర్తు చేశారు. వారి సహకారంతో తెలంగాణలో రోడ్లను నేషనల్ హైవేలుగా మార్చుకుంటామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి