ఆగస్టు 13 నుంచి NIMSలో పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు.. ఒక్క రూపాయి అవసరం లేదు

హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్‌ వైద్యులు, పీడియాట్రిక్‌ కార్డియాక్‌ సర్జన్ల సహకారంతో అవసరమైన చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయనున్నారు. అర్హత ఉన్న పిల్లలను వాక్‌-ఇన్‌ విధానంలో పరిశీలించి, వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తారు..

ఆగస్టు 13 నుంచి NIMSలో పిల్లలకు ఉచితంగా హార్ట్ సర్జరీలు.. ఒక్క రూపాయి అవసరం లేదు
Free Child Heart Surgeries at NIMS Hyderabad

Edited By:

Updated on: Aug 10, 2026 | 10:26 AM

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 10: హైదరాబాద్‌లోని నిమ్స్ లో పిల్లలకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ తెలిపారు.నిమ్స్ కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ అమరేశ్వర్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్‌ రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల బృందం సహకారంతో ఈ ప్రత్యేక శస్త్రచికిత్సలు చేపట్టనున్నారు.

గత ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి ఉచిత గుండె శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి. అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్‌-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీటీ సర్జరీ కార్యాలయం, మొదటి అంతస్తు, పాత బ్లాక్, నిమ్స్ లో సంప్రదించాలి. అందుబాటులో ఉంటే గతంలో చేయించిన వైద్య పరీక్షలు, పాత వైద్య నివేదికలుఅర్హత ఉన్న చిన్నారుల తల్లిదండ్రులు ఎలాంటి ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేకుండా, నిర్ణీత సమయాల్లో నిమ్స్‌కు నేరుగా వచ్చి సంప్రదించవచ్చని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్‌ రాహుల్ దేవరాజ్ తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us