విషాదాన్ని నింపిన సెలవు దినం.. 12 ఏళ్ల లోపు చిన్నారులు బలి..

ఆదివారం సెలవు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడు కుటుంబాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. నలుగురు చిన్నారులు జలసమాదయ్యారు. సరదాగా ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న ఒక్కరోజే రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు.

విషాదాన్ని నింపిన సెలవు దినం.. 12 ఏళ్ల లోపు చిన్నారులు బలి..
Childran Lost Lives
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 12, 2024 | 11:39 AM

ఆదివారం సెలవు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మూడు కుటుంబాల్లో ఊహించని విషాదాన్ని నింపింది. నలుగురు చిన్నారులు జలసమాదయ్యారు. సరదాగా ఈతకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మృతుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నిన్న ఒక్కరోజే రెండు వేరువేరు ఘటనల్లో నలుగురు చిన్నారులు మృతి చెందారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు గ్రామ శివారులోని మడుగులో ఈతకు వెళ్లారు. వీరిలో యాకూబ్(12), జంపన్న(10) అనే ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడ్డారు.

అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్ రావ్ మండలం తాడిచెర్లలో మరో విషాదం జరిగింది. తాడిచెర్ల చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ వరుణ్ (12) అనిల్ (10) అనే అన్నదమ్ములుగా గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో మేకలు కాయడానికి వెళ్లిన చిన్నారులు చెరువులో శవాలై తేలారు. ఒకరు చెరువులో జారిపడగా.. అతనిని కాపాడే ప్రయత్నంలో మరొకరు కూడా చెరువులోకి దూకారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృత దేహాలను వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టంకు పంపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
సొంతింటి కల..నెరవేర్చుకోండిలా..!
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.