గతంలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీపై పెద్దఎత్తున విమర్శలు రాగా పరీక్షలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఛైర్మన్ బాధ్యతలను రిటైడ్ ఐపీఎస్‌కు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఛైర్మన్, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించారు. ఛైర్మన్ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకోగా స్క్రీనింగ్ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది. ఛైర్మన్ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరు గవర్నర్ ఆమోదానికి సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సభ్యుల నియామక ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ పోస్టుల కోసం వచ్చిన 370 వరకు దరఖాస్తుల.. పరిశీలన, అర్హులను సూచించే పనిని సెర్చ్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది.