మరోసారి మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి! భారీ ఆర్థిక సాయం!

మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డిలోని క్యాన్సర్ రోగి రాణమ్మకు రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. నిరుపేద క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారం అందించాలని ఆయన నిర్ణయించుకున్నారు. క్యాన్సర్ చికిత్స ఖర్చుతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని, తన నియోజకవర్గంలోని అర్హులకు సాయం చేస్తానని తెలిపారు.

మరోసారి మానవత్వం చాటుకున్న జగ్గారెడ్డి! భారీ ఆర్థిక సాయం!
Jagga Reddy's 4 Lakh Donati

Edited By: SN Pasha

Updated on: Jun 09, 2025 | 7:26 PM

మరోసారి మానవత్వం చాటుకున్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డిలో క్యాన్సర్ పేషెంట్ రాణమ్మను పరామర్శించి, క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో క్యాన్సర్ తో బాధపడే నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లక్షల రూపాయలతో కూడుకున్న వ్యవహారం కావడంతో పేదలు ఆర్థికంగా చితికిపోతున్నరని అన్నారు.

సంగారెడ్డి పట్టణంలోనీ సోమేశ్వర వాడకు చెందిన రాణమ్మ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం నాలుగు లక్షలు అందించినట్లు తెలిపారు. క్యాన్సర్ అనేది ఎవ్వరికీ రావొద్దు, క్యాన్సర్ బాధితులది టెన్షన్ లతో కూడిన జీవితం అని అన్నారు. లక్షల రూపాయల ఖర్చు చేసినా కొన్ని సందర్బాల్లో బతకడం కష్టం. ఆ పేషంట్ ట్రీట్మెంట్ కోసం అప్పులు చేసిన ఆ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నా నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్థోమత లేని పేద క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను అన్నారు జగ్గారెడ్డి.

మొన్న సదాశివపేటలో క్యాన్సర్ పేషెంట్‌కు రూ.10 లక్షలు, ఈ రోజు సంగారెడ్డి పట్టణానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌కు రూ.4 లక్షల ఆర్థిక సహకారం అందించారు. తన వద్దకు ఆరోగ్య సమస్యల ట్రీట్మెంట్ కోసం సహాయం కావాలని ఎంతోమంది వస్తారో.. వారందరికీ కూడా సహాయం అందుతుందని హామీ ఇచ్చారు. ఆర్థిక సాయం అందించి ఇలా మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం కూడా జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎంతో మంది దాతలు ఉన్నారు. క్యాన్సర్ పేషెంట్‌లకు వారి ద్వారా సహాయం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో మీడియా ముఖంగా ఆర్థిక సాయం అందించినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి