Watch Video: ‘తొలి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల భర్తీ మాట నిలబెట్టుకోండి’.. కాంగ్రెస్‎కు కేటీఆర్ సూచన..

తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మెగా డీఎస్సీ అంటూ దగా చేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ వేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని తేదీతో సహా ప్రకటించింది మీరుకాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు సాంకేతిక కారణాలు సాకుగా చూపి తప్పించుకుంటున్నారన్నారు. గతంలో కేసీఆర్ ప్రకటించిన డీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా కేవలం 5వేల ఉద్యోగాలు మాత్రమే జోడించారన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 సంఖ్య పెంచకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Watch Video: 'తొలి ఏడాదిలో 2లక్షల ఉద్యోగాల భర్తీ మాట నిలబెట్టుకోండి'.. కాంగ్రెస్‎కు కేటీఆర్ సూచన..
Former Minister Ktr
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:30 PM

తెలంగాణ యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మెగా డీఎస్సీ అంటూ దగా చేశారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ వేస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని తేదీతో సహా ప్రకటించింది మీరుకాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు సాంకేతిక కారణాలు సాకుగా చూపి తప్పించుకుంటున్నారన్నారు. గతంలో కేసీఆర్ ప్రకటించిన డీఎస్సీ ఉద్యోగాల నోటిఫికేషన్ రద్దు చేసి అదనంగా కేవలం 5వేల ఉద్యోగాలు మాత్రమే జోడించారన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 సంఖ్య పెంచకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ యువతకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈరోజు హైదరాబాద్‎లోని నంది నగర్ నివాసంలో తనను కలిసిన నిరుద్యోగ యువతకు ఈ మేరకు హామీ ఇచ్చారు కేటీఆర్. ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్‎కు అండగా నిలిచారో.. ఇప్పుడు వారే కథానాయకులై కాంగ్రెస్‎ను నిలదీస్తారని కేటీఆర్ చెబుతున్నారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అన్న దానికి అనుగుణంగా పోస్టులను భర్తీ చేయండన్నారు. మొదటి సంవత్సరంలోనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని, మాటను నిలబెట్టుకోమని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వెంటనే వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయండని, లేకుటే విద్యార్థి, యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్దంగా ఉన్నామని హెచ్చరించారు. ఈరోజు ఆయన నివాసంలో కలిసిన విద్యార్థులు, నిరుద్యోగులకు ధైర్యాన్ని ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..