Telangana: టంగుటూరులో విషాదం… ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రి

| Edited By: Balaraju Goud

Mar 04, 2024 | 11:09 AM

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కన్న తండ్రి. అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Telangana: టంగుటూరులో విషాదం... ముగ్గురు పిల్లలను చంపి చెట్టుకు ఉరి వేసుకున్న తండ్రి
Crime
Follow us on

రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపి, ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు కన్న తండ్రి. అభం శుభం తెలియని చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల బాధతో రవి (35)అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు తన ముగ్గురు కుమారులు సాయికిరణ్ (13) మోహిత్ కుమార్ (10) ఉదయ్ కిరణ్ (7) ను అత్యంత దారుణంగా హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గత కొంతకాలంగా గ్రామంలోని ప్రజల వద్ద ఇతర గ్రామాల ప్రజల వద్ద నుంచి మనీ స్కాం నిర్వహిస్తూ వెయ్యికి 3,000 చొప్పున, అలాగే లక్షకు 58 రోజులకు 5 లక్షలు ఇప్పిస్తానంటూ ఇరుగు పొరుగు వారిని నమ్మించాడు రవి. దీంతో పెద్ద మొత్తాల్లో డబ్బులు కట్టించాడు. తీరా డబ్బులు రాకపోవడంతోపాటు అప్పులు ఇచ్చిన జనం ఇంటికి రావడంతో అయోమయానికి గురయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన రవి దారుణానికి ఒడిగట్టాడు.

ఇంట్లో పిల్లలను చంపి తాను పంట పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న భార్య శ్రీలత, కుటుంబీకులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న మోకిలా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక ఈ దారుణానికి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. పలువురి నుంచి పెద్ద ఎత్తున డబ్బులు సేకరించినట్లు వెల్లడించారు. డబ్బు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో రవి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..