Vijayashanthi on CM KCR : తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అణిచివేయలని చూస్తున్నారని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఆరోపించారు. ‘నాపై అక్రమ కేసులు పెట్టి, భయాందోళనకు గురి చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నాడు’ అని ఆమె అన్నారు. “2012 మహబూబ్ నగర్ లో నిర్వహించిన టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి లేదని… నాలుగు రోజుల క్రితం నాకు నాంపల్లి కోర్టు నుండి నాకు నోటీసులు వచ్చాయి.. ఆ సభను నిర్వహించింది కేసీఆర్. కేసు పెడితే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఆయన పైనే పెట్టాలి. 2012 లో జరిగిన ఘటనకు, 9 ఏళ్ల తరువాత కేసు పెట్టించడంలో ముఖ్యమంత్రి భయం అర్థం అవుతుంది”. అంటూ విజయశాంతి ఫైరయ్యారు.
— VijayashanthiOfficial (@vijayashanthi_m) April 1, 2021
Read also : ZPTC, MPTC ఎన్నికలపై కొత్త AP SEC నీలం సాహ్ని ఫోకస్, గవర్నర్.. CS ఆదిత్యనాధ్ దాస్ తో వరుస భేటీలు